మహేష్ హత్య కేసులో ట్విస్ట్, ఫ్రెండ్ హరి చంపించాడు – సోదరి

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 11:10 AM IST
మహేష్ హత్య కేసులో ట్విస్ట్, ఫ్రెండ్ హరి చంపించాడు – సోదరి

Updated On : October 12, 2020 / 11:22 AM IST

Mahesh murder case : విజయవాడ కమిషనరేట్ ఉద్యోగి మహేశ్‌ హత్య కేసు మిస్టరీ వీడడం లేదు. ఎవరు చంపారు ? హత్యకు ఎవరు ప్లాన్ చేశారనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఓ వైపు పోలీసులు దర్యాప్తు జరుపుతున్న క్రమంలో..హత్యకు గురైన మహేశ్ సోదరి సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్ ను ఫ్రెండ్ హరినే హత్య చేయించాడని సోదరి సునీత ఆరోపణలు చేసింది. 10tvతో ఆమె మాట్లాడింది.



తమ్ముడు మహేశ్, హరికి చిన్న చిన్న గొడవలున్నాయని, ప్లాన్ ప్రకారమే..తమ్ముడిని హత్య చేయించాడని తెలిపింది. మద్యం సేవించేందుకు మహేశ్ ను పొలాల్లోకి హరి తీసుకెళ్లినట్లు, హరిని పోలీసులు విచారిస్తే..అసలు విషయాలు బయటకు వస్తాయని తెలిపింది. ప్రేమ వ్యవహారమే కాదన్నారు.



ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు హరి శరీరంపై గాయాలు చేసుకున్నాడని, కాల్పులు జరిపితే..గాయపడిన మహేశ్ ను కారులో తీసుకెళ్లాలి కదా ? అని ప్రశ్నించింది. క్రాంతి అనే అమ్మాయిని చేసుకోవాలని అనుకున్నామని, ఈ విషయం తెలిసిన తర్వాత..అమ్మాయి తల్లి కుప్పకూలిందన్నారు.



విజయవాడ సీపీ ఆఫీసులో పనిచేసే మహేశ్‌‌ను దారుణంగా హత్య చేసిన వ్యక్తుల కోసం పోలీసులు సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మహేశ్‌పై కాల్పులు జరిపారని పోలీసులు గుర్తించారు. మహేశ్‌ను పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చిందెవరు? హత్య చేసిన వ్యక్తులు మృతుడి కారును ఎందుకు తీసుకెళ్లారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.



కాల్పుల్లో గాయపడ్డ మహేశ్ స్నేహితుడు.. హరికృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతను కోలుకొని.. నోరు విప్పితేనే మహేశ్ హత్యకు అసలు కారణమేంటో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.