Pawan Kalyan : 21 నుంచి జనసేన సభ్యత్వ నమోదు.. విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపు
సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలోపేతం చేసేలా క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం చేపట్టాలన్నారు.

Pawan Kalyan
Pawan Kalyan : క్రియాశీలక సభ్యత్వ నమోదుపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. ఈ నెల 21వ తేదీ నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించిన పవన్.. సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 2వేల మంది సభ్యత్వం తీసుకునేలా చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం అవుతోందని వెల్లడించిన పవన్.. పార్టీని మరింత బలోపేతం చేసేలా క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం చేపట్టాలన్నారు. ఈ మేరకు జనసైనికులు, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తూ వీడియోను విడుదల చేశారు.
గతంలో జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం కల్పించామని.. లక్ష మందికి బీమా సౌకర్యం వర్తింప చేశామని.. చనిపోయిన కార్యకర్తలకు అండగా నిలిచామని ఈ సందర్భంగా గుర్తుచేశారు పవన్. పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికులు, వీర మహిళలు చురుక్కుగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పవన్.
Pawan Kalyan : గౌతమ్ సవాంగ్‌ని ఎందుకు తప్పించారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్
” 2020 సెప్టెంబర్ నెలలో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించాం. దాదాపు లక్షమందికి పైగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి.. అభిమానంతో పని చేసేవారు ఉన్నట్టు నా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా యువత ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడటం నా దృష్టికి వచ్చింది. అలాగే కొంతమంది జన సైనికులు ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. ప్రమాదానికి గురైనవారికి, మరణించిన వారి కుటుంబాలకు జనసేన నాయకులు వ్యక్తిగతంగా సాయం అందించారు.
Pawan Kalyan: ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే “సలహాదారు పోస్టులు” ఇచ్చుకోవడం కాదు: పవన్
ఇవన్నీ చూసి జన సైనికులకు ఏదైనా చేయాలన్న తపనతో పార్టీలోని సీనియర్ నాయకులు, కార్యవర్గంతో మాట్లాడి బీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఇందుకోసం ప్రీమియం కోసం రూ.కోటి నిధిని అందచేశా. ఈ కార్యక్రమాన్ని జన సైనికులు పెద్ద ఉద్యమంలా చేపట్టారు. లక్ష మందికిపైగా సభ్యత్వాలు నమోదయ్యేలా కృషి చేశారు. ఇప్పటివరకు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన 23 మంది జనసైనికుల కుటుంబాలకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీమా చెక్కులు అందించారు. మన కోసం తపన పడ్డ వ్యక్తులు, కుటుంబాలకు అండగా ఉండాలని చేపట్టింది. దీనిని ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జనసైనికుడు, వీరమహిళలు ముందుండి నడింపించాలని కోరారు పవన్ కళ్యాణ్.
క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి – JanaSena Chief Shri @PawanKalyan
#JSPMembershipDrive pic.twitter.com/QndudRnUXY
— JanaSena Party (@JanaSenaParty) February 17, 2022