కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

Updated On : February 27, 2021 / 1:49 PM IST

Man suicide with call money harassment : ఏపీలో కాల్ మనీ ఆగడాలు ఆగడం లేదు. కాల్ మనీ వేధింపులకు అనేక మంది బలవుతున్నారు. వేధింపులు భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో దారుణం జరిగింది. కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

చంద్రారెడ్డి వద్ద స్థలం కాగితాలు కుదువపెట్టి దత్తయ్య అప్పు చేశాడు. వడ్డీతో సహా లక్షా 70 వేలు కడతామన్నా చంద్రారెడ్డి తీసుకోలేదు. స్థలం కాగితాలు ఇవ్వకపోవడంతో దత్తయ్య మనస్థాపం చెందాడు. అధిక మోతాదులో మాత్రలు మింగి దత్తయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మృతుడికి భార్య నాగలక్ష్మమ్మ, కుమారుడు యుగంధర్‌ ఉన్నారు. కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.