భార్యతో వ్యభిచారం చేయించైనా అప్పు తీర్చు : వడ్డీ వ్యాపారి వేధింపులకు వ్యక్తి ఆత్మహత్య

  • Published By: murthy ,Published On : May 30, 2020 / 09:42 AM IST
భార్యతో వ్యభిచారం చేయించైనా అప్పు తీర్చు : వడ్డీ వ్యాపారి వేధింపులకు వ్యక్తి ఆత్మహత్య

Updated On : May 30, 2020 / 9:42 AM IST

వడ్డీ వ్యాపారి వేధింపులకు చిత్తూరు జిల్లాలో ఓ నిండు ప్రాణం బలయ్యింది. జిల్లాలోని శ్రీకాళహస్తి లో డోలు వాయిద్య కళాకారుడిగా నగర వాసులకు సుపరిచుతుడైన వెంకటరమణ అనే వ్యక్తి వడ్డీ వ్యాపారి  వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు. 

లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయానని కరోనా సమయంలో కనికరించండి అని వేడుకున్నా, వడ్డీ వ్యాపారి తీవ్ర పదజాలంతో దూషించటంతో వెంకట రమణ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యచేత వ్యభిచారం చేయించైనా అప్పుతీర్చాలన్న వడ్డీ వ్యాపారి మాటలతో మనస్తాపం చెందిన వెంకట రమణ ఉరి వేసుకున్నాడు.

వడ్డీ వ్యాపారి వద్ద 50 వేల రూపాయలు అప్పుచేసిన వెంకట రమణ ఇప్పటికే అందులో 25వేల రూపాయలు చెల్లించాడు. మరోక 25 వేల రూపాయలు మాత్రం చెల్లించాల్సిఉంది. ఆత్మహత్య చేసుకోటానికి ముందు  వెంకట రమణ తన బాధను సెల్ఫీ వీడియోలో చెప్పుకున్నాడు.   

Read: విశాఖలో వాలంటీర్ వేధింపులు తట్టుకోలేక టీడీపీ సీనియర్ నేత డ్రైవర్ ఆత్మహత్య