మరో వివాదంలో మాన్సాస్ ట్రస్ట్..అయోధ్య మైదానానికి తాళం వేసిన ఎంఆర్ కాలేజ్

మరో వివాదంలో మాన్సాస్ ట్రస్ట్..అయోధ్య మైదానానికి తాళం వేసిన ఎంఆర్ కాలేజ్

Updated On : December 15, 2020 / 2:36 PM IST

mansas trust in another dispute : విజయనగరం మాన్సాస్ ట్రస్ట్‌ మరో వివాదంలో చిక్కుకుంది. విజయనగరం పట్టణంలో ఎంతో పేరున్న అయోధ్య మైదానానికి ఎంఆర్ కళాశాల యాజమాన్యం తాళం వేసింది. ఎన్నో ఏళ్లుగా అయోధ్య మైదానంలో నిత్యం విజయనగర వాసులు వాకింగ్, క్రీడలకు వస్తున్నారు.

అయితే అనూహ్యంగా మైదానానికి తాళం వేసిన యాజమాన్యం కేవలం సిబ్బంది, విద్యార్థులకు మాత్రమే ప్రవేశం అంటూ నోటీస్ బోర్డు పెట్టింది. ఉదయం వాకింగ్ కోసం గ్రౌండ్ దగ్గరకు వచ్చిన విజయనగర వాసులు… బోర్డు చూసి అవాక్కయ్యారు. యాజమాన్య తీరుకు నిరసనగా…. రోడ్డుపైనే పిల్లలు ఆటలాడుకున్నారు.