Robbery in Palasa : వామ్మో ఇలా ఉన్నారేంట్రా.. చేతులకు బేడీలు వేసి మరీ ముప్పావు కేజీ బంగారం చోరీ..
Robbery in Palasa : పలాసలో భారీ దొంగతన వెలుగు చూసింది. షాపు యజమానికి బేడీలు వేసి మరీ ముప్పావు కేజీ బంగారం దొచుకెళ్లారు.
Massive robbery in palasa jewellery store in srikakulam
- పలాసలో భారీ దొంగతనం
- జీఎస్టీ అధికారులమంటూ షాపులో దూరి
- ముప్పావు కేజీ బంగారం చోరీ
Robbery in Palasa : శ్రీకాకుళం జిల్లాలోని పలాస పట్టణంలో పట్టపగలు భారీ చోరీ వెలుగుచూసింది. ఏకంగా షాపు యజమానికి బేడీలు వేసి మరీ ముప్పావు కేజీ బంగారంతో ఉడాయించారు దొంగలు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస పట్టణంలో వెంకటేశ్వర జ్యుయలరీ షాపు ఉంది. దాని యజమాని కిల్లంశెట్టి రామకృష్ణ. ఈ క్రమంలో మంగళవారం నాడు ఆరుగురు వ్యక్తులు జీఎస్టీ అధికారులమంటూ షాపులోకి వచ్చారు. చెక్ చేయాలని చెప్పి.. షాపు యజమాని రామకృష్ణకు బేడీలు వేశారు. ఆ తర్వాత షాపులో ఉన్న ముప్పావు కేజీ బంగారం దోచుకెళ్లారు.
వచ్చింది అధికారులు కాదు.. దొంగలని తెలుసుకున్న రామకృష్ణ.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాల కోసం గాలిస్తోంది.
