Anil Kumar Yadav : చంద్రబాబు ఇక సీఎం అయ్యే అవకాశమే లేదు.. అందుకే ఈ డ్రామా

చంద్రబాబు చేసిందంతా డ్రామా అని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. సానుభూతి పొందేందుకే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Anil Kumar Yadav

Anil Kumar Yadav : అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ నేతలు తన భార్య భువనేశ్వరి పట్ల అవమానకర రీతిలో మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తీవ్ర ఆరోపణలు, ప్రెస్ మీట్ లో ఆయన వెక్కి వెక్కి ఏడ్చిన అంశాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు చేసిన ఆరోపణలకు వైసీపీ ఎమ్మెల్యేలు అంతే ఘాటుగా బదులిస్తున్నారు. చంద్రబాబుది డ్రామా అని, సింపతీ కోసమే ఇదంతా చేశారని ఎదురుదాడికి దిగారు.

Read More..Invest Grow Your Wealth: ఈ సీక్రెట్ తెలిస్తే.. రూ.10లక్షల పెట్టుబడితో రూ.100 కోట్లు ఈజీగా సంపాదించొచ్చు..!

చంద్రబాబు చేసిందంతా డ్రామా అని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. సానుభూతి పొందేందుకే చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ”సీఎం జగన్ పై టీడీపీ నేతల వ్యాఖ్యలను చంద్రబాబు మరిచిపోయినట్లున్నారు. చంద్రబాబు తన కుటుంబంపై తానే బురద జల్లుకుంటున్నారు. చంద్రబాబు దొంగ ఏడుపులను ప్రజలు నమ్మరు. చంద్రబాబు పని అయిపోయింది. అసెంబ్లీకి రానని చంద్రబాబే స్వయంగా చెప్పారని’’ మంత్రి అనిల్‌ అన్నారు.

Chandrababu: శపథాలు చేశారు.. సీఎంలు అయ్యారు.. జయలలిత, జగన్ తర్వాతెవరు..?

‘చంద్రబాబు చేసిందంతా ఒక డ్రామా.. ఆయన ఒక నటన రాయుడు.. సానుభూతి పొందేందుకే చంద్రబాబు దిగజారిపోయి మాట్లాడుతున్నాడు.. చెప్పని విషయాన్ని కూడా చెబుతూ తన కుటుంబంపై తానే బురద చల్లుకుంటున్నాడు. ఆయన కుటుంబాన్ని ఎవరు విమర్శించ లేదు. ఎవరు చేసిన పాపాలు వారు పరిహారం చెల్లించక తప్పదని చంద్రబాబును చూస్తే అర్థమవుతుంది. చంద్రబాబు దొంగ ఏడుపులను ప్రజలు నమ్మరు. చంద్రబాబు పని అయిపోయింది. ఆయన అసెంబ్లీకి శాశ్వతంగా రానని చెప్పేశారు. చంద్రబాబు ఇక ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు. అందుకే అసెంబ్లీకి ముఖ్యమంత్రి అయ్యేవరకు రానంటూ ఆయన జాతకాన్ని ఆయనే రాసుకున్నారు’ అని మంత్రి అనిల్ అన్నారు.