భయపడొద్దు, ఢిల్లీకి వెళ్లి వచ్చిన 280మందిలో 200మందిని గుర్తించాం

ప్రకాశం జిల్లా చీరాలో కరోనా కేసు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. భార్యభర్తలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆ దంపతులు 280 మంది

  • Published By: veegamteam ,Published On : March 30, 2020 / 01:27 PM IST
భయపడొద్దు, ఢిల్లీకి వెళ్లి వచ్చిన 280మందిలో 200మందిని గుర్తించాం

Updated On : March 30, 2020 / 1:27 PM IST

ప్రకాశం జిల్లా చీరాలో కరోనా కేసు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. భార్యభర్తలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆ దంపతులు 280 మంది

ప్రకాశం జిల్లా చీరాలో కరోనా కేసు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. భార్యభర్తలకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాగా, కరోనా పాజిటివ్‌ వచ్చిన ఆ దంపతులు 280 మంది బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లి వచ్చారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంకా ఎంతమందికి కరోనా సోకి ఉంటుందో అని చీరాల ప్రజలు భయపడుతున్నారు. దీనిపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. సోమవారం(మార్చి 30,2020) మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటికే ఆ బృందంలోని 200 మందిని గుర్తించి ఐసోలేషన్‌, క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించమన్నారు.

వారి రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. వారి కోసం ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇక మిగతా వారిని కూడా గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన బృందంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు వెలుగు చూడటం.. వీరివెంట అధిక సంఖ్యలో ప్రజలు ఉండటంతో కొంత భయానక వాతావారణం నెలకొందన్నారు. అయితే దీనిపై ప్రజలెవరూ ఆందోళన పడొద్దని మంత్రి కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిచాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు, వైద్యులు చెప్పిన సూచనలు తప్పకుండా పాటించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలు కఠిన తరం అయినప్పటికీ పాటించక తప్పదని మంత్రి బాలిరెడ్డి అన్నారు. ప్రస్తుతం స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనాకు మందు అన్నారు. కాగా లాక్ డౌన్ వేళ ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చూసుకుంటుందని మంత్రి చెప్పారు. ఒక్కరు కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి వెల్లడించారు.

” ఏపీ నుంచి 280 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చినట్టు గుర్తించాము. వాళ్లందరిని గుర్తించాము. క్వారంటైన్ లో ఉంచాము. వారి నమూనాలు ల్యాబ్ కి పంపాము. ఏ ప్రాబ్లమ్ ఉండదని ఆశిస్తున్నాము. అన్ని రకాల చర్యలు తీసుకుంటాము. వారం రోజులు వారు ఎక్కడెక్కడ తిరిగారో ఐడెంటిఫై చేస్తాము. వారి కుటుంబసభ్యల శాంపుల్స్ కూడా తీసుకుంటాము. 280లో 200మందిని గుర్తించడం జరిగింది. త్వరలోనే మిగతావారిని కూడా గుర్తిస్తాం. చికిత్స, ఆహారం అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ప్రజలు భయపడాల్సిన పని లేదు. కానీ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే ఇబ్బంది లేదు. లాక్ డౌన్ ఉన్నంత కాలం ప్రజలు ఇళ్లలోనే ఉంటే ఏ ఇబ్బంది లేదు. దయచేసి ప్రభుత్వం నిర్ణయాలను అందరూ సమర్థించాలి, పాటించాలి. దాని వల్ల ప్రాణ హాని తప్పుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు కఠినంగా ఉన్నా పాటించక తప్పదు” అని మంత్రి బాలినేని చెప్పారు.

* ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనలకు ఏపీ నుంచి హాజరైన సుమారు 500మంది
* ప్రకాశం జిల్లా నుంచి 280 మంది, నెల్లూరు నుంచి 70 మంది, కాకినాడ నుంచి 26మంది, మిగతా జిల్లాల నుంచి ఢిల్లీ వెళ్లిన సుమారు 50 మంది
* ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు
* ఇప్పటికే సగం మందిని గుర్తించి క్వారంటైన్ లో ఉంచిన అధికారులు