Kottu Satyanarayana : మీకా దమ్ముందా? చంద్రబాబు, లోకేశ్, పవన్‌కు మంత్రి కొట్టు సవాల్
Kottu Satyanarayana : కాపు ద్రోహి, కాపులను పొట్టన పెట్టుకున్న చంద్రబాబు పంచన ఎందుకు చేరాడో పవన్ సమాధానం చెప్పాలి.

Kottu Satyanarayana (Photo : Google)
Kottu Satyanarayana – Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు చేశారు. దమ్ముంటే.. అంటూ సవాల్ విసిరారు.
వారాహి యాత్రతో పవన్ గ్రాఫ్ పదిశాతం పడిపోయిందన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. పవన్ కార్యక్రమానికి వేల సంఖ్యలో వచ్చే వారని, ప్రస్తుతం వందల సంఖ్యలోకి పడిపోయిందని చెప్పారు. నకిలీ తెలుగుదేశం మహానాడుతో గోదావరి జిల్లాల్లో టీడీపీకి ఓట్లు పడవన్నారు. చంద్రబాబు.. పవన్ ను పంపినా ఫలితం ఉండదన్నారు. చంద్రబాబు, అతని దుష్టతయాన్ని పవన్ కల్యాణ్ పల్లెత్తు మాట కూడా అనడం లేదని మండిపడ్డారు.
”కాపు ద్రోహి, కాపులను పొట్టన పెట్టుకున్న చంద్రబాబు పంచన ఎందుకు చేరాడో పవన్ సమాధానం చెప్పాలి. వంగవీటి రంగా చనిపోవడానికి కారణం కాపులే అన్న విధంగా పవన్ మాట్లాడుతున్నాడు. కాపులను గూండాలుగా పవన్ మారుస్తుండడంపై వాళ్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఎక్కడ ఏం గొడవలు జరిగినా జనసేన కార్యకర్తలే ఉంటారు. పవన్ కార్యకర్తలను మిలిటెంట్లుగా తయారు చేస్తున్నాడా? పవన్ కార్యకర్తలు గొడవల్లో ఉంటూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటే ఎలా?
చంద్రబాబు, పవన్ మాట్లాడే మాటలు.. కుట్రలకు తెరలేపే విధంగా ఉన్నాయి. చంద్రబాబు, అతని అసలు కొడుక్కి, దత్తపుత్రుడికి దమ్ముంటే చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన చూసి ఓటెయ్యమని అడగండి. మేం చెబుతాం.. మా పరిపాలన చూసి ఓటెయ్యమని ఇంటింటికి తిరిగి అడుగుతాం. మా సవాల్ ను స్వీకరిస్తారా? రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు అండ్ కో బ్యాచ్ లేకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది” అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.