Kottu Satyanarayana : విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షణ.. ప్రారంభించిన మంత్రి కొట్టు సత్యనారాయణ
రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సీఎం జగన్ పై అమ్మవారి అనుగ్రహం ఉండాలన్నారు.

Kottu Satyanarayana Giri Pradakshan
Indrakiladri – Giri Pradakshan : విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షణ వైభవంగా సాగుతోంది. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గిరి ప్రదక్షణను ప్రారంభించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ కనక దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి రథాన్ని లాగి ప్రారంభించారు.
పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షణ ప్రారంభం అయింది. ఘాట్ రోడ్డు ప్రారంభం నుంచి 7 కిలో మీటర్ల మేర గిరి ప్రదక్షిణ కొనసాగింది. డప్పు వాయిద్యాలు, కోలాటాల మధ్య స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు గిరి ప్రదక్షణ నిర్వహించారు.
అనంతరం మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి రోజున గిరి ప్రదక్షణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఇంద్రకీలాద్రి గిరి ప్రదర్శన చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందన్నారు.
రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. సీఎం జగన్ పై అమ్మవారి అనుగ్రహం ఉండాలన్నారు. రాష్ట్రంలో పాడి పంటలు సంమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు.