Kurasala Kannababu: చంద్రబాబు కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్: మంత్రి కురసాల కన్నబాబు
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ కి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారని కన్నబాబు అన్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని ఆరోపించారు

Kurasala
Kurasala Kannababu: 20224 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ కి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారని కన్నబాబు అన్నారు. “ప్రజలకు మేలు చేస్తామని ఆపార్టీ నేత ఎప్పుడూ చెప్పరు.. జగన్ ని ఓడిస్తామనీ, చంద్రబాబుని గెలిపిస్తామనీ అంటుంటారు” అంటూ పవన్ పై విమర్శలు గుప్పించారు. టీడీపీకి అనుబంధంగానే జనసేన ఉందన్న సంగతి ప్రజలందరికి తెలుసునన్న కన్నబాబు..చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని ఆరోపించారు.
Also read: Somu Veerraju: పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన “బీజేపీ రోడ్ మ్యాప్”పై స్పందించిన సోము వీర్రాజు
బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే మేము అందరం కలిసి పనిచేస్తామని పవన్ మాట్లాడారని..అంటే బీజేపీని కూడా టీడీపీతో కలుపుకుని వెళ్లాలని వీరి పథకమా? అంటూ సందేహం వెలిబుచ్చారు మంత్రి కన్నబాబు. గత ఎన్నికలలో పవన్ పోటీ చేసిన చోట చంద్రబాబు ప్రచారం చేయలేదని, చంద్రబాబు పోటీ చేసిన చోట పవన్ ప్రచారం చేయలేదని.. ఇలా లోపాయికారి ఒప్పందంతో వీరిద్దరూ పని చేసిన సంగతి అందరికీ తెలుసునని మంత్రి కన్నబాబు విమర్శించారు. నీతి ఆయోగ్ లాంటి సంస్థలే జగన్ విధానాలను మెచ్చుకున్నాయని మంత్రి అన్నారు. “తన పార్టీ అభివృద్ధి కన్నా చంద్రబాబు బాగు చూసే వ్యక్తి పవన్, చంద్రబాబు కూడా తన గురించి కాకుండా పవన్ గురించి ఆలోచిస్తుంటారు.. చంద్రబాబు, పవన్ ఆలోచనా విధానం ఒకటే.. వీరిద్దరి వలన రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదు” అంటూ ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కన్నబాబు.
Also read: AP Assembly : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..!
అయితే తమ నేత జగన్ వీళ్లలాగా ఎప్పుడూ వ్యవహరించలేదని..ఇంకొకరితో కలిస్తేనే అధికారంలోకి రావాలని జగన్ ఏనాడూ అనుకోలేదని కన్నబాబు తెలిపారు. జగన్ ఒక వ్యక్తి కాదు, శక్తి అంటూ ప్రశంసించిన మంత్రి కన్నబాబు.. ఇలాంటి వారందరినీ ఎదుర్కోగల శక్తి జగన్ కి ఉందని అన్నారు. ప్రజల ఆలోచనే జగన్ విధానమని తెలిపారు. పవన్ ప్రకటన తర్వాత కొన్ని పచ్చపత్రికలు పండుగ చేసుకున్నాయని.. ఇలాంటివి జగన్ చాలానే చూశారని మంత్రి కన్నబాబు అన్నారు.
Also read: Sangam Dairy : సంగం డైరీ చైర్మనే ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటారు-ధూళిపాళ నరేంద్ర