AP YCP Politics : నగరిలో రోజాకు మరోసారి షాకిచ్చిన సొంతపార్టీ నేతలు .. టీడీపీ, జనసేన నవ్వుకునేలా చేస్తున్నారంటూ ఫైర్

కొంతకాలంగా నగరి వైసీపీలో.. రోజా అనుకూల, వ్యతిరేక వర్గాలు రోజాకు మరోసారి షాకిచ్చాయి. కొప్పేడు గ్రామంలో రోజాకు సమాచారం ఇవ్వకుండానే రైతు భరోసా కేంద్రానికి రోజా వ్యతిరేకవర్గం భూమి పూజ నిర్వహించారు. దీంతో నన్ను సంప్రదించకుండా భూమి పూజ చేయటం ఏంటి అంటూ రోజా తెగ మండిపడిపోతున్నారు.

AP YCP Politics : నగరిలో రోజాకు మరోసారి షాకిచ్చిన సొంతపార్టీ నేతలు .. టీడీపీ, జనసేన నవ్వుకునేలా చేస్తున్నారంటూ ఫైర్

minister roja expresse dissatisfaction on her opposite section in nagari ysr

Updated On : October 17, 2022 / 5:24 PM IST

AP YCP Politics : వైసీపీ నేత రోజా ప్రతిపక్షాలపై ఇష్టమొచ్చినట్లుగా..నోటికి ఎంత వస్తే అంతలా విరుచుకుపడిపోతుంటారు. అటువంటి రోజాకా తన సొంత నియోజకవర్గంలోనే సొంత పార్టీ నేతలు మరోసారి షాక్ ఇచ్చారు. రోజా నియోజకవర్గం అయిన నగరిలో వైసీపీలో కొంతమంది నేతలకు..రోజాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేధాలున్నాయి. రోజాకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా కొంతమంది నేతలు వ్యవహరిస్తున్నారు. వారిపై రోజా ఎప్పటికప్పుడు అసహనం వ్యక్తం చేస్తునే ఉంటారు.దీంతో సొంతపార్టీలో..సొంత నియోజకవర్గంలోనే సమాధానం చెప్పుకోని దుస్ధితిలో ఉన్న రోజా మాపై విమర్శలు చేస్తారా?అంటూ ప్రతిపక్షనేతలు కూడా విమర్శలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే మరోసారి రోజాకి తలనొప్పిగా మారారు నగరి నియోజకవర్గంలోని కొంతమంది వైసీపీ నేతలు.

కొంతకాలంగా నగరి వైసీపీలో.. రోజా అనుకూల, వ్యతిరేక వర్గాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో ఈ విషయం భగ్గుమన్నాయి. రోజాకు వ్యతిరేకంగా ఉన్న ఓ వర్గం నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం కొప్పేడు గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం బోర్డు చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం గురించి రోజాకు సమాచారం లేదు. దీంతో నన్ను సంప్రదించకుండా భూమి పూజ చేయటం ఏంటి అంటూ రోజా తెగ మండిపడిపోతున్నారు. పైగా ఇప్పటివరకు ఓ లెక్క ఇప్పటినుంచి మరో లెక్క అన్నట్లుగా రోజా ఇప్పుడు మంత్రికూడానాయే..దీంతో ఆమె ఇగో హర్ట్ అయ్యింది. నాకు తెలికుండా నాకు సమాచారం లేకుండా భూమి పూజ చేయటం ఏంటీ అంటూ అటు మింగలేక..ఇటు కక్కలేక అన్నట్లుగా మండిపోతున్న పరిస్థితిలో సతమతమైపోతున్నారు రోజా.

మంత్రిగా ఉన్న తనను నియోజకవర్గంలో వీక్ చేసే విధంగా సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను లేకుండా.. తనకు చెప్పకుండా .. భూమి పూజ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో రోజా మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ఒకటి వైరల్‌గా మారింది. అందులో..‘‘మంత్రిగా ఉన్న తనను నియోజకవర్గంలో వీక్ చేసే విధంగా.. టీడీపీ, జనసేన నవ్వుకునే విధంగా.. ఆ పార్టీలకు సపోర్టు అవుతూ.. నాకు నష్టం జరిగే విధంగా.. మన పార్టీని దిగజారుస్తూ వీళ్లు భూమి పూజ చేయడం ఎంత వరకు కరెక్ట్.. మీరంతా ఆలోచించాలి.. ఇలాంటి వాళ్లు కంటిన్యూ అయితే నేను రాజకీయాలు చేయడం కష్టం. నేను ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే.. ప్రతిరోజు మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా పార్టీకి, నాకు నష్టం చేన్నారు. వీళ్లు పార్టీ నాయకులని చెప్పి ఎంకరేజ్ చేయడం కూడా బాధేస్తుంది’’ అని రోజా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.