వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన

  • Published By: naveen ,Published On : October 17, 2020 / 02:46 PM IST
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటన

Updated On : October 17, 2020 / 3:00 PM IST

ministers visit flood affected areas: ఏపీలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాలు నీటి మునిగాయి. పలు లంక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం(అక్టోబర్ 17,2020) వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథ రాజు.. హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి మేకతోటి సుచరిత బోటులో వెళ్లారు.

వరదలకు నీట మునిగిన పంట పొలాలను, లంక గ్రామాలను మంత్రులు పరిశీలించారు. గ్రామ ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రులతో పాటు వ్యవసాయ మిషన్‌ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున ఉ‍న్నారు.