Punganur Girl Asiya Case: వ్యాపారి వద్ద అప్పు తీసుకుని అతడి కూతురిని చంపిన మహిళ

అప్పు తీర్చాలని అజ్మాతుల్లా ఒత్తిడి తీసుకురావడంతో ఆయనను ఏమీ చేయలేక ఆయన కుమార్తెపై..

Punganur Girl Asiya Case: వ్యాపారి వద్ద అప్పు తీసుకుని అతడి కూతురిని చంపిన మహిళ

Updated On : October 6, 2024 / 3:47 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల ఆరేళ్ల బాలిక అదృశ్యమైన కేసు విషాదాంతమైంది. అజ్మతుల్లా అనే వ్యక్తి కూతురు అస్వియా స్నేహితులతో ఇంటి వద్ద ఆడుకుంటూ అదృశ్యం కాగా దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు.

ఆర్థికపరమైన కారణాలతోనే బాలికను హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ లో నిందితులు పడేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాకు వెల్లడించారు.

అస్వియా తండ్రి అజ్మతుల్లా వద్ద అప్పు తీసుకున్న మహిళే ఈ దారుణానికి ఒడిగట్టిందని చెప్పారు. అప్పు తీర్చాలని అజ్మాతుల్లా ఒత్తిడి తీసుకురావడంతో ఆయనను ఏమీ చేయలేకఆయన కుమార్తెపై నిందితురాలు దారుణానికి ఒడిగట్టిందని అన్నారు.

ఇంటి వద్ద ఆడుకుంటున్న అస్వియాను కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకెళ్లి ఊపిరాడకుండా చేసి, చనిపోయిన తర్వాత వాటర్ స్టోరేజ్ లో పడవేసిందని వివరించారు. బాలిక కుటుంబాన్ని హోం మంత్రి అనిత పరామర్శించారు. పాప కనిపించకుండా పోయిన మరుక్షణం నుంచే పోలీసులు అప్రమత్తమయ్యారని అనిత అన్నారు.

సుమారు 12 బృందాలను ఏర్పాటు చేసి పాప కోసం ముమ్మరంగా గాలించామని చెప్పారు. కనిపించకుండా పోయిన రెండు రోజుల తర్వాత పాప మృతదేహం వాటర్ ట్యాంకులో కనిపించిందని అన్నారు. ఒంటిపై ఎలాంటి గాయాలులేవని, లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు కూడా లేవని చెప్పారు.

భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు ఎందుకు వెళ్తున్నారు? ఎస్‌సీవో ప్రాధాన్యం ఏంటి?