ఎంపీ మిథున్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్‌కు నో చెప్పిన కోర్టు.. అరెస్టు పక్కానా?
ఏపీలో కూటమి సర్కార్ పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి డైలీ ఎపిసోడ్‌గా మారిన లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి.

YCP MP Mithun Reddy
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..ఇప్పటికే అటవీ భూముల ఆక్రమణలు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన భూముల లెక్క తేల్చేందుకు కూటమి సర్కార్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డి వంతు వచ్చినట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ ఉన్నప్పుడు లిక్కర్ పాలసీ ఇంప్లిమెంటేషన్‌లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయన్న అలిగేషన్స్ ఉన్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం కూడా రిలీజ్ చేసింది.
సీఐడీ కేసు నమోదు చేసింది. సర్కార్ ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ కేసు హైకోర్టుకు వెళ్లింది. లిక్కర్ ఫైల్స్ బయటికి రాబోతున్నాయంటూ టీడీపీ నేతలు స్టేట్‌మెంట్లు ఇవ్వడంతో అలర్ట్ అయిన మిథన్‌రెడ్డి హైకోర్టు మెట్లెక్కారు. మద్యం అక్రమాల విషయంలో గతేడాది సెప్టెంబర్ 23న సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అందుకు హైకోర్టు నిరాకరించింది. అరెస్ట్ నుంచి మిథున్ రెడ్డికి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే హైకోర్టు వ్యాఖ్యలతో మిథున్ రెడ్డి అరెస్టుకు మార్గం ఈజీ అయిందన్న టాక్ వినిపిస్తోంది.
వేల కోట్ల రూపాయల అవినీతి?
వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో రకరకాల మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల అవినీతి చేశారని ఎప్పటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది టీడీపీ. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరికొందరిపై తీవ్ర అలిగేషన్స్ చేస్తోంది.
ఏపీలో వైసీపీ పెద్దలు చేసిన మద్యం కుంభకోణంతో సర్కార్ ఖజానాకు 18వేల కోట్ల నష్టం జరిగిందని అంటున్నారు కూటమి నేతలు. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీమ్..ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో తనిఖీలు చేసింది. కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను సీజ్ చేసి ల్యాబ్‌కు పంపి నివేదిక తెప్పించుకుంది. ఆ రిపోర్ట్‌లో సిట్ సంచలన అంశాలను గుర్తించిందట.
లిక్కర్ స్కామ్‌లో వైసీపీ పెద్దలు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌లో పెద్ద పోస్ట్‌లో ఉన్న అధికారులతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు అందరి పాత్ర ఉందని అంటోంది టీడీపీ. వీరిలో ఐదుగురు విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ముందు వాంగ్మూలాలు ఇచ్చారట.
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్, ఎస్‌ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగితో పాటు, రమేశ్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తి, బేవరేజెస్ కార్పొరేషన్ ఆఫీస్‌లో ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ తమ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.వీరిలో సత్యప్రసాద్ దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా వాంగ్మూలం ఇచ్చినట్లు చెబుతున్నారు. స్కామ్ జరిగిన తీరును పూసగుచ్చినట్లు వివరించినట్లు టాక్ వినిపిస్తోంది.
2019లో జగన్ అధికారంలోకి వచ్చీ రాగానే మద్యం పాలసీ మార్చేశారు. మద్య పాన నిషేధం పేరుతో..ప్రైవేటు షాప్స్ ప్లేస్‌లో ప్రభుత్వ దుకాణాలు తెరిచారు. అయితే స్కామ్ జరగడానికి అదే మూలమంటోంటి టీడీపీ. ఇండెంట్ పెట్టడం అనే ప్రాసెస్‌ను పూర్తిగా ఎత్తేశారట. ఇష్టం వచ్చిన బ్రాండ్లను అమ్మారట. అయితే గత సర్కార్ హయాంలో వైసీపీ పెద్దలకు కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన బ్రాండ్లను మాత్రమే దుకాణాలకు పంపించేవారట.
లిక్కర్ కమీషన్ల మీద ఎక్కువ ఫోకస్?
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నారు. అయితే ఆయన ఐటీ కంటే లిక్కర్ కమీషన్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవారన్న అలిగేషన్స్ ఉన్నాయి. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా మద్యం స్కామ్‌కు సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని కుండబద్దలు కొట్టారు. దీంతో సిట్ అధికారులకు ఓ స్పష్టత వచ్చిందట.
మద్యం డిస్టిలరీస్ నుంచి ఆర్గనైజర్లు వసూలు చేసిన మొత్తాన్ని రాజ్ కసిరెడ్డి ద్వారా వైసీపీలో కీలక నేతకు, అక్కడి నుంచి పెద్దలకు డబ్బులు చేరేవని చైన్ లింక్‌లో కీలక ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. సిట్ అధికారుల విచారణలో ఎవరి వాటా ఎంత అన్నది వాసుదేవ రెడ్డి, సత్యప్రసాద్ చెప్పినట్లు తెలిసింది. వారిద్దరూ ఇచ్చిన ఇన్ఫోను బేస్ చేసుకుని..లోతుగా కూపీ లాగగా ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి భారీగా లబ్ధి పొందినట్లు అంచనాకు వచ్చారట. మద్యం బాటిళ్లు అమ్మిన తర్వాత మిగిలే ఖాళీ అట్టపెట్టెల ద్వారా వచ్చిన సొమ్ములో కూడా ఆయన వాటా అడిగేవారట.
ఏపీలో కూటమి సర్కార్ పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి డైలీ ఎపిసోడ్‌గా మారిన లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ క్లైమాక్స్‌కు చేరుకుంటున్నాయి. ఎంపీ మిథున్‌రెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడం..కోర్టు తిరస్కరించడంతో ఇక రేపో మాపో అరెస్టులు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వాళ్ల అరెస్టులకు కాస్త బ్రేక్ ఇచ్చి..లిక్కర్, ల్యాండ్, స్యాండ్, మైనింగ్ మీద ఫోకస్ పెడుతారని అంటున్నారు. చూడాలి మరి ఎవరెవరి అరెస్టులు ఉంటాయో?