Alajangi Jogarao : చంద్రబాబు దళిత వ్యతిరేకి.. గజం స్థలం ఆక్రమించినట్లు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా
కబ్జాలు, ఆక్రమణలు అంటే పార్వతీపురంలో గుర్తుకు వచ్చేది టీడీపీ నేతలేనని ఆరోపించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను సంబంధిత అధికారులకు పంపితే అది తప్పా అని ప్రశ్నించారు.

Alajangi Jogarao angry Chandrababu
Alajangi Jogarao – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)పై పార్వతీపురం(Parvathipuram) ఎమ్మెల్యే అలజంగి జోగారావు(Alajangi Jogarao) ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక దళిత ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. ఈమేరకు గురువారం ఆయన పార్వతీపురంలో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు దళిత వ్యతిరేకి అని మరోసారి రుజువైందని తెలిపారు. తాను ఎక్కడైనా ఒక్క గజం స్థలం ఆక్రమించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకోవడమే కాకుండా అక్కడే ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేశారు. స్థానిక నేతలు ఇచ్చిన అసత్యాలను వల్లెవేసిన చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఇదేనా అని నిలదీశారు.
AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రామ సచివాలయాల్లో ఆర్టీఐ వ్యవస్థ ఏర్పాటు
కబ్జాలు, ఆక్రమణలు అంటే పార్వతీపురంలో గుర్తుకు వచ్చేది టీడీపీ నేతలేనని ఆరోపించారు. తన వద్దకు వచ్చే ప్రజల సమస్యలను సంబంధిత అధికారులకు పంపితే అది తప్పా అని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పాటైన పార్వతీపురం జిల్లా అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.