Ambati Rambabu: చంద్రబాబు హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఒక్కటి కూడా జరగలేదు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌పై టీడీపీ అడ్డగోలు విమర్శలు చేస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ambati Rambabu: చంద్రబాబు హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఒక్కటి కూడా జరగలేదు

Ambati Rambabu Commented On Tdp Ap Politics1

Updated On : December 22, 2021 / 8:37 PM IST

Ambati Rambabu: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌పై టీడీపీ అడ్డగోలు విమర్శలు చేస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌లు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు రాంబాబు. చంద్రబాబు తన ఊహాల్లో మాత్రమే ఏపీని అభివృద్ధి చేశారని, వైఎస్ఆర్ హయాంలోనే హైదరాబాద్‌ ఓటర్‌ రింగ్‌రోడ్డు పూర్తయిందన్నారు అంబటి రాంబాబు.

చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎన్ని వాగ్దానాలు నెరవేర్చారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. తన హయాంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి, సంక్షేమం ఒక్కటి కూడా రాష్ట్రంలో జరగలేదని, మూడేళ్లలో లక్షా 50వేల కోట్లను సంక్షేమం కోసం జగన్ సర్కార్ ఖర్చుపెట్టిందని అన్నారు రాంబాబు. చంద్రబాబు హయాంలోనే క్రైస్తవులపై దాడులు జరిగాయని, గుంటూరు జిల్లాలో దళితులపై దాడి జరగలేదన్నారు.

కులాలు వర్గాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వైసీపీని కించపరచడమే లక్ష్యంగా పైకి రావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కుటిల ప్రయత్నాలను ప్రజలు తెలుసుకుంటారని అన్నారు. చంద్రబాబు హయాంలో అరాచకాలు, అన్యాయాలు దారుణంగా జరిగాయని, చంద్రబాబు మాటల్ని ప్రజలు ఎవరూ విశ్వసించట్లేదని అన్నారు.

తన హయాంలో ఇళ్ల రుణాలను ఎందుకు మాఫీ చయలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒటీఎస్‌లో బలవంతం ఏమీ లేదని, ఇష్టం ఉన్నోళ్లే కట్టుకోవచ్చునని అన్నారు.