MLA Balakrishna : హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిపై బాలకృష్ణ సెల్ఫీ చాలెంజ్

హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రభుత్వానికి సెల్ఫీ చాలెంజ్ విసిరారు..మా హయాంలో చేసింది ఏంటో కనిపిస్తోంది..మీ ప్రభుత్వం చేసింది ఏంటో చెప్పాలంటూ చాలెంజ్ విసిరారు.

MLA Balakrishna : హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిపై బాలకృష్ణ సెల్ఫీ చాలెంజ్

TDP MLA balakrishna

Updated On : November 16, 2023 / 2:14 PM IST

TDP MLA Balakrishna selfie challenge : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించారు. టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం అయిన హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధిపై ప్రభుత్వానికి సెల్ఫీ చాలెంజ్ విసిరారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో హిందూపురం ఆస్పత్రిని అభివృద్ధి చేశామనీ..మరి వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆస్పత్రిని ఏం అభివృద్ది చేసిందో చెప్పాలి అంటూ చాలెంజ్ చేశారు. టీడీపీ హయాంలో చేసింది తప్ప వైసీపీ చేసింది ఏమీ లేదు అంటూ విమర్శించారు.

బస్సు యాత్ర అంటూ మొదలు పెట్టిన వైసీపీ నాయకులను ఎక్కడెక్కడ ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. పన్నుల మీద పన్నులు వేస్తు ప్రజల నడ్డి విరుస్తున్నారని..ఆఖరికి గాలి మీద కూడా పన్ను వేస్తారు అంటూ ఎద్దేవా చేశారు. అమరావతి ఉద్యమకారులను పెయిడ్ ఆర్టిస్టులు అన్నారని, అసలైన పెయిడ్ ఆర్టిస్టులు విశాఖ సమ్మిట్ లో పాల్గొన్నవారే అంటూ సెటైర్లు వేశారు.

Balakrishna : నాది, పవన్ కళ్యాణ్ ది ఒకటే భావజాలం.. దేనికీ భయపడని వ్యక్తిత్వం : ఎమ్మెల్యే బాలకృష్ణ

రాష్ట్రంలో పరిపాలన ఇష్టానురాజ్యంగా జరుగుతుందన్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి ప్రభుత్వం అవసరమా..? అంటూ ప్రశ్నించారు. అప్పుల తప్ప అభివద్ధి చేయలేని..చేతకాని ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.