Kotamreddy Sridhar Reddy : అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన తెలిపారు. తనకు మైక్ ఇవ్వాలంటూ కోటంరెడ్డి నిరసనకు దిగారు. నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని ప్లకార్డు పట్టుకుని నిలబడి నిరసన తెలుపుతున్నారు.

Kotam Reddy
Kotamreddy Sridhar Reddy : ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన తెలిపారు. తనకు మైక్ ఇవ్వాలంటూ కోటంరెడ్డి నిరసనకు దిగారు. నియోజకవర్గ సమస్యలపై మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని ప్లకార్డు పట్టుకుని నిలబడి నిరసన తెలుపుతున్నారు. అయితే సమస్యలపై ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రం ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు.
కోటంరెడ్డి తీరుపై మంత్రులు మండిపడ్డారు. కోటంరెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత అంశాలకు సభలో చోటు లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి విన్నవించుకుంటే పరిశీలిస్తామని చెప్పారు.
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, కీలక బిల్లులకు ఆమోదం
అటు శ్రీధర్ రెడ్డి దురుద్దేశంతోనే వచ్చారని మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. టీడీపీతో కలిసి దుర్మార్గానికి దిగుతున్నారని మండిపడ్డారు. నమ్మకద్రోహి శ్రీధర్ రెడ్డి అంటూ మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.