Vangaveeti-Vamsi Meet: వంగవీటి రాధను కలిసిన వల్లభనేని వంశీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Vangaveeti-Vamsi Meet: వంగవీటి రాధను కలిసిన వల్లభనేని వంశీ

Vangaveeti

Updated On : December 26, 2021 / 12:45 PM IST

Vangaveeti-Vamsi Meet: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ నాయకులు వంగవీటి రాధాకృష్ణను కలవడం చర్చనీయాంశం అవుతోంది. 2019 ఎన్నికల ముందే టీడీపీలో చేరి కీలకంగా వ్యవహరించిన రాధా.. తర్వాతి కాలంలో సైలెంట్ అయిపోయారు.

అప్పుడప్పుడు అమరావతి రైతుల ఉద్యమం, ప్రైవేట్ కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉన్నప్పటికీ, రాజకీయాలకు మాత్రం పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఇటీవల మంత్రి కోడాలి నానిని కూడా ఒక కార్యక్రమంలో కలిశారు వంగవీటి రాధ. లేటెస్ట్‌గా ఇప్పుడు మాత్రం వంగవీటి రాధా కార్యాలయంలో వంశీ, రాధ భేటీ అయ్యారు.

వంగవీటి రంగా వర్ధంతి సంధర్భంగా రంగా విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించిన అనంతరం.. వీరిద్దరూ రాధ ఆపీసులో మాట్లాడుకోవడం జరిగింది. వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్‌ విషయంలో ఇప్పటివరకు క్లారిటీ అయితే లేదు కానీ, తెలుగుదేశం నేతగానూ యాక్టీవ్‌గా లేరు.. వేరే పార్టీలోనూ చేరలేదు. జనసేనతో కూడా రాధ కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉన్నారు.