Mohammed Karimunnisa : వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా కన్నుమూత

వైసీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. ఆ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా (65) గుండెపుటుతో అకాలమరణం చెందారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Mohammed Karimunnisa : వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా కన్నుమూత

Mohammed Karimunnisa

Updated On : November 20, 2021 / 7:07 AM IST

Mohammed Karimunnisa : వైసీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. ఆ పార్టీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా (65) గుండెపోటుతో అకాలమరణం చెందారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురైన ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కాగా శుక్రవారం ఉదయం అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యారు కరీమున్నీసా.

చదవండి : MLC Elections : ఏపీ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ

కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన ఈమె.. జగన్ వైసీపీ పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరారు.. పార్టీ స్థాపించిన కరీమున్నీసా క్రియాశీలకంగా వ్యవహరించారు. విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి.. 56వ డివిజన్ నుంచి విజయం సాధించారు. ఆమె పార్టీకి చేసిన సేవలను గుర్తించిన జగన్, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మార్చిలో ఆమె శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇక ఆమె మృతి పట్ల వైసీపీ నేతలు సంతాపం తెలిపారు

చదవండి : MLC Elections : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ అభ్యర్థులు వీరే..!