Movie Tickets: ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందా?

ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై నెలకొన్న వివాదం క్లైమాక్స్‌కు చేరుతున్నట్లు కనిపిస్తోంది.

Movie Tickets: ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందా?

Movie Ticket Rate Controversy

Updated On : December 31, 2021 / 7:12 AM IST

Movie Ticket Rate Controversy: ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై నెలకొన్న వివాదం క్లైమాక్స్‌కు చేరుతున్నట్లు కనిపిస్తోంది. ఇవాళ(31 డిసెంబర్ 2021) మధ్యాహ్నం సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం కానుంది. జూమ్‌ ద్వారా కమిటీ సభ్యులు భేటీ కానున్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై చర్చించనున్నారు.

సినిమా టికెట్ ధరల విషయంలో ఎవరెవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది? అవి పరిష్కారం అవ్వాలంటే ఏం చెయ్యాలి? టికెట్ ధరలు ఏ స్థాయిలో ఉంటే బెటరనే దానిపై కమిటీ ఓ నిర్ణయానికి రానుంది.

రాష్ట్రంలోని థియేటర్ల యజమానులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. 9 జిల్లాల పరిధిలో సీజ్ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం జిల్లా జాయింట్ కలెక్టర్‌కు అప్లికేషన్ పెట్టుకోవాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని సూచించారు.

అధికారులు సీజ్ చేసిన థియేటర్ల ఓనర్లు, సినీనటుడు ఆర్.నారాయణమూర్తి మంత్రి పేర్ని నానిని కలిశారు. ఆ తర్వాతే అన్ని రూల్స్ పాటిస్తూ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవడంతో పాటు వసతులు కల్పించేందుకు నెల రోజులు గడువు ఇచ్చింది ప్రభుత్వం. సినిమా హాళ్ల తనిఖీల్లో అధికారులు గుర్తించిన లోపాలను ఎగ్జిబిటర్లు సరిదిద్దాల్సి స్పష్టంచేశారు.