అమరావతిలో రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే.. రూ.53 వేల కోట్ల సంపద : ఎంపీ కనకమేడల

రాజధాని తరలింపు నిర్ణయం సరికాదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే రూ.53 వేల కోట్ల సంపద వస్తుందన్నారు.

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 04:08 PM IST
అమరావతిలో రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే.. రూ.53 వేల కోట్ల సంపద : ఎంపీ కనకమేడల

Updated On : January 2, 2020 / 4:08 PM IST

రాజధాని తరలింపు నిర్ణయం సరికాదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే రూ.53 వేల కోట్ల సంపద వస్తుందన్నారు.

రాజధాని తరలింపు నిర్ణయం సరికాదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం (జనవరి 2, 2020) మీడియాతో మాట్లాడుతూ అమరావతి అభివృద్ధికి రూ.6 వేల కోట్లు ఖర్చు పెడితే రూ.53 వేల కోట్ల సంపద వస్తుందన్నారు. ఆ సంపదతో 13 జిల్లాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. 

రాజధాని నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టలేదన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను రోడ్డున పడేస్తున్నారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు స్పందించాలని…లేకుంటే వారి బిడ్డల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందన్నారు. 

రాజధాని తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా వెలగపూడిలో 16వ రోజు కూడా దీక్షలు కొనసాగాయి. అమరావతికి భూములిచ్చిన రైతులను కించపరిచే విధంగా వైసీపీ నాయకులు, మంత్రులు మాట్లాడుతున్నారని రాజధాని వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమరావతిలో పూర్తిస్థాయి రాజధాని కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించే వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.

కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ వెలగపూడి రైతులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖలు రాశారు. రాజధాని మార్చితే తమ బతుకులు అయోమయంలో పడతాయని… బతికి ఇంక ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాతల కాలం నాటి నుంచి నమ్ముకుని బతుకుతున్న భూములను రాజధాని కోసం త్యాగం చేస్తే… ప్రభుత్వం తమ నమ్మకాలను వమ్ము చేసిందని వాపోయారు.