Naga Babu: పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పవన్ ప్రకటిస్తారు.. ఇలాంటి వాళ్లకు టికెట్లు ఇవ్వం: నాగబాబు
ఏపీలో టీడీపీతో పొత్తుతో పోటీ చేస్తామని చెప్పారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు అక్రమమని నాగబాబు అన్నారు.

Naga Babu
Naga Babu-JanaSena: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటిస్తారని ఆ పార్టీ నేత నాగబాబు అన్నారు. ఇవాళ తిరుపతిలో నాగబాబు మీడియాతో మాట్లాడారు.
రూ.కోట్ల కొద్దీ ఆస్తులున్న నేతలు తమ పార్టీకి అవసరం లేదని నాగబాబు చెప్పారు. ప్రజలకు సేవలు అందించే వారే జనసేనకు ప్రధానమని అన్నారు. అలాగే, తమ పార్టీ అవినీతి పరులకు టికెట్ ఇవ్వదని స్పష్టం చేశారు. ఏపీలో టీడీపీతో పొత్తుతో పోటీ చేస్తామని చెప్పారు.
ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు అక్రమమని నాగబాబు అన్నారు. పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రలో తొలి మూడు దశలు దిగ్విజయంగా ముగిశాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ తీరును పవన్ ఎండగట్టారని చెప్పారు. నాలుగో విడత వారాహి యాత్రను పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో త్వరలోనే ప్రారంభిస్తారని తెలిపారు.
పవన్ ఆలోచనల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తమ కార్యకర్తలకు నాగబాబు చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొందరిపై అన్యాయంగా కేసులు పెట్టిస్తోందని అన్నారు. తాము కేసులకు భయపడబోమని చెప్పారు.

JanaSen