Launch Journey : నాగార్జున సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం..నేటి నుంచి పున:ప్రారంభం

నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు నేటి నుంచి మళ్లీ ప్రారంభంకానున్నాయి. సాగర్‌లో ఉదయం 9 గంటలకు లాంచీ బయల్దేరుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం చేరుతుంది.

Launch Journey : నాగార్జున సాగర్-శ్రీశైలం లాంచీ ప్రయాణం..నేటి నుంచి పున:ప్రారంభం

Launch (1)

Updated On : November 29, 2021 / 9:44 AM IST

Nagarjuna Sagar-Srisailam launch : నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీ సేవలు నేటి నుంచి మళ్లీ ప్రారంభంకానున్నాయి. సాగర్‌లో ఉదయం 9 గంటలకు లాంచీ బయల్దేరుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీశైలం చేరుతుంది. మళ్లీ మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీశైలం నుంచి బయల్దేరి నాగార్జున సాగర్‌ వస్తుందని అధికారులు వెల్లడించారు.

నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలానికి ఒకవైపు ప్రయాణానికి పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200గా టికెట్‌ ధర నిర్ణయించారు. రెండు వైపులా ప్రయాణానికి పెద్దలకు రూ.2500, పిల్లలకు రూ.2 వేలు తీసుకోనున్నారు.

Smart Power Substations : విశాఖపట్నం జిల్లాలో స్మార్ట్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు

నాగార్జున సాగర్‌ నుంచి శ్రీశైలానికి లాంచీలో ప్రయాణం అంత్యంత ఆనందదాయకంగా ఉంటుంది. చుట్టూ పచ్చని కొండలు, నల్లమల అటవీ అందాలు, కృష్ణమ్మ పరవళ్లు వీక్షించవచ్చు. అయితే ఆ అందాలను ఆస్వాదించేందుకు సిద్ధమవ్వండి మరి.