Suspicious Death : నందివాడ ఎస్సై శిరీష భర్త అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం

అశోక్ ఇంట్లో ఉరేసుకోగా గుర్తించిన భార్య శిరీష, ఆమె తరపు బంధువులు వెంటనే గుడివాడ ఏలూరు రోడ్డులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అశోక్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Suspicious Death : నందివాడ ఎస్సై శిరీష భర్త అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం

Suspicious Death

Updated On : September 11, 2023 / 11:11 AM IST

SI Sirisha Husband Suspicious Death : ఏపీలోని కృష్ణా జిల్లా నందివాడ ఎస్సై శిరీష భర్త అనుమానాస్పదంగా మృతి చెందారు. నందివాడ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పామర్తి శిరీష భర్త బి.అశోక్ (30) ఆదివారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందారు. అశోక్ ఇంట్లో ఉరేసుకోగా గుర్తించిన భార్య శిరీష, ఆమె తరపు బంధువులు వెంటనే గుడివాడ ఏలూరు రోడ్డులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అప్పటికే అశోక్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ప్రైవేట్ ఆస్పత్రిలోనే ఉంచారు. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సాయంత్రం ఈ సంఘటన జరిగితే రాత్రి 10 గంటల వరకు దీనిపై ఎటువంటి కేసు నమోదు కాకపోవడం గమనార్హం. ఏలూరుకు చెందిన శిరీష, గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన బి.అశోక్ రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

Maharashtra : భార్య, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న పోలీసు అధికారి

శరీష, అశోక్ కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసు గల ఒక కుమార్తె ఉన్నారు. ఈ నేపథ్యంలో శిరీష మచిలీపట్నంలోని స్పెషల్ బ్రాంచ్ ఎస్సైగా పని చేస్తూ 4 నెలల కిందట నందివాడకు బదిలీపై వచ్చారు. అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. మరోవైపు ఇది హత్యేనని అశోక్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు.