Bhuma Akhilapriya Remand : భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ కు 14 రోజుల రిమాండ్
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిలప్రియను ఉదయం ఆళ్లగడ్డలో ఆమె నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకొని, పాణ్యం పోలీస్ స్టేషన్ లో విచారించారు.

Bhuma Akhilapriya Remand
Nandyala court remands Bhuma Akhilapriya : టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు నంద్యాల కోర్టులో చుక్కెదురైంది. భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ రిమాండ్ కు ఆదేశించింది. భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ తోపాటు మరికొంత మందిని రిమాండ్ కు తరలించారు.
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో భూమా అఖిలప్రియను ఉదయం ఆళ్లగడ్డలో ఆమె నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకొని, పాణ్యం పోలీస్ స్టేషన్ లో విచారించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పోలీసులు వారిని నంద్యాల కోర్టులో హాజరు పరిచారు.
Bhuma Akhila Priya : భూమా అఖిల ప్రియ, భర్త భార్గవ్ రామ్‌లపై హత్యాయత్నం కేసు నమోదు
ఈ మేరకు కోర్టు భూమా అఖిలప్రియ, ఆమె భార్గవ్ రామ్ తోపాటు మరికొంతమందికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ మేరకు వారిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. కాగా, గొడవకు సంబంధం లేని తన భర్తపై కేసు నమోదు చేయడం ఏమిటని భూమా అఖిలప్రియ పోలీసులను ప్రశ్నించారు.