Nara Bhuvaneswari: ఆ విషయంలో మా అక్క పురంధేశ్వరి ఎంతగానో కృషి చేశారు

సంజీవిని ఆసుపత్రి, మొబైల్ క్లినిక్‌ని మంగళగిరిలో లోకేష్ స్టార్ట్ చేశారు. కుప్పంలో స్టార్ట్ చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని భువనేశ్వరి తెలిపారు.

Nara Bhuvaneswari: ఆ విషయంలో మా అక్క పురంధేశ్వరి ఎంతగానో కృషి చేశారు

Nara Bhuvaneswari

Updated On : August 29, 2023 / 1:41 PM IST

Chandrababu Naidu Wife : మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. భారత ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు మీద వంద రూపాయల నాణెం విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇందుకు మా అక్క పురంధేశ్వరి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. కుప్పంలో సంజీవిని ఆసుపత్రికి సొంత భవనం నిర్మిస్తామని చెప్పారు. కుప్పంలో ఇల్లు కట్టుకోవడం ఆలస్యమైంది.. ఇక్కడ ఇల్లు పూర్తయ్యాక కుటుంబంతో అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటామని చెప్పారు.

Freebies: ఉచిత పథకాలు లేకపోతే ఎన్నికల్లో గెలవలేరా.. అసలెందుకీ పరిస్థితి?

నారావారి పల్లికి వచ్చి వారంరోజులు ఉంటే ఏడాది మొత్తం ఆ జ్ఞాపకాలను చర్చించుకుంటామని నారా భువనేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరిస్తున్నామని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని అన్నారు. మహిళ అనుకుంటే ఏదైనా చేయగలదు అనేది నేను చాలా నమ్ముతాను. ఒక గృహణిగాఉన్న నన్ను వ్యాపారాలు చూడాలని చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారని చెప్పారు. ఏ విపత్కర పరిస్థితి తలెత్తిన ప్రభుత్వం కంటే మా ట్రస్టు ద్వారా సహాయం అందించేందుకు ముందుంటామని అన్నారు.

NTR Rs.100 Coin: ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ధర ఎంత..? ఎలా పొందాలో తెలుసుకోండి..

సంజీవిని ఆసుపత్రి, మొబైల్ క్లినిక్‌ని మంగళగిరిలో లోకేష్ స్టార్ట్ చేశారు. కుప్పంలో స్టార్ట్ చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని భువనేశ్వరి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పది ప్రాంతాల్లో సంజీవిని క్లినిక్, మొబైల్ వైద్య సేవలు ఏర్పాటు చేస్తాం. మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు భవిష్యత్తులో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సంజీవిని ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని నారా భువనేశ్వరి చెప్పారు.