NTR Rs.100 Coin: ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ధర ఎంత..? ఎలా పొందాలో తెలుసుకోండి..

ఎన్టీఆర్ రూ. 100 నాణెంను మంగళవారం ఉదయం నుంచి విక్రయానికి అందుబాటులోకి తెచ్చారు. తొలి విడతగా 12వేల స్మారక నాణేలు ముద్రించారు.

NTR Rs.100 Coin: ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ధర ఎంత..? ఎలా పొందాలో తెలుసుకోండి..

NTR 100 Rupees Coin

Updated On : August 29, 2023 / 9:20 AM IST

NTR 100 Rupees Coin: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక వీడియోను ప్రదర్శించారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ రూ.100 నాణేన్ని ఆవిష్కరించారు. ఈ నాణెం హైదరాబాద్‌ మింట్‌లో తయారైంది. తెలంగాణ సచివాలయం సమీపంలోని మింట్ కాంపౌండ్‌లో గతంలో అనేక రకాల నాణేలు తయారు చేసినప్పటికీ.. ఒక వ్యక్తి స్మారకార్థం రూపొందించిన తొలి నాణెం ఎన్టీఆర్‌దేనట.

NTR 100 Rupees Coin Release: ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఎన్టీఆర్ రూ. 100 నాణెంను మంగళవారం ఉదయం నుంచి విక్రయానికి అందుబాటులోకి తెచ్చారు. తొలి విడతగా 12వేల ఎన్టీఆర్ స్మారక నాణేలు ముద్రించారు.  50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం జింక్, 5శాతం నికెల్ మిశ్రమంతో  ఈ నాణెం తయారు చేశారు. ఒక్కో నాణెం ధర రూ. 3,500 నుంచి రూ. 4,850 వరకు ఉంది. ఆన్‌లైన్ ద్వారా కానీ, సచివాలయం వద్దఉన్న మింట్ మ్యూజియం, చర్లపల్లిలోని మింట్ వద్ద ఏర్పాటు చేసిన సేల్స్ కౌంటర్‌లో విక్రయానికి అందుబాటులోకి తెచ్చారు. మూడు వేరియంట్లలో ఈ నాణెం అందుబాటులోకి ఉంటుంది. ఎన్టీఆర్ నాణేనికి చాలా డిమాండ్ ఉందని, త్వరలోనే మరిన్ని నాణేలను అందుబాటులోకి తీసుకొస్తామని హైదరాబాద్ మింట్ సిబ్బంది తెలిపారు.

NTR 100 Rupees Coin: ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల.. ఢిల్లీకి చేరిన చంద్రబాబు, పురంధరేశ్వరి.. ఎవరెవరు పాల్గొంటున్నారంటే

మంగళవారం ఉదయం 10గంటల నుంచి ఎన్టీఆర్ రూ. 100 నాణెంను విక్రయానికి అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతానికి 12వేల స్మారక నాణేలు ముద్రించారు. డిమాండ్ మరింత ఉంటే మరిన్ని తయారు చేయనున్నారు. తాజాగా ఎన్టీఆర్ చిత్రంతో రూ. 100 నాణెంను సొంతం చేసుకొనేందుకు చాలా మంది తెలుగువారు ఆసక్తిచూపుతున్నారు. ఈ ఎన్టీఆర్ 100 రూపాయల నాణెంను www.indiagovtmint.in అనే వెబ్‌సైట్ ద్వారా ఎన్టీఆర్ నాణెంసహా ఇతర మహనీయుల స్మారకార్థం విడుదల చేసిన నాణెలనుకూడా ఈ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.