Nara Bhuvaneswari : జైలు నుంచి చంద్రబాబు విడుదల.. భునవేశ్వరి, లోకేశ్ ఏమన్నారంటే

ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో రోడ్డెక్కి చేసిన నిరసనలు, వారు చూపిన తెగువ, మాకు మరింత స్ఫూర్తినిచ్చాయి. Nara Bhuvaneswari

Nara Bhuvaneswari : జైలు నుంచి చంద్రబాబు విడుదల.. భునవేశ్వరి, లోకేశ్ ఏమన్నారంటే

Nara Bhuvaneswari On Chandrababu Release

Updated On : October 31, 2023 / 7:05 PM IST

Nara Bhuvaneswari On Chandrababu Release : మధ్యంతర బెయిల్ పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల కావడంపై నారా భునవేశ్వరి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ తో ఈ 53 రోజులు క్షణం ఒక యుగంలా గడిచిందని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ట్వీట్ చేశారు.

”చంద్రబాబు అరెస్ట్ తో ఈ 53 రోజుల కాలం ఎంతో వేదన, తట్టుకోలేనంత బాధతో క్షణం ఒక యుగంలా గడిచింది. ఈ కష్ట సమయంలో తెలుగు జాతి నుంచి వచ్చిన మద్దతు మాకు ఎంతో ఊరటనిచ్చింది. సత్యం బలం ఎంతో చూపించింది. ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో రోడ్డెక్కి చేసిన నిరసనలు, వారు చూపిన తెగువ, మాకు మరింత స్ఫూర్తినిచ్చాయి.

Also Read : మీరు చూపిన అభిమానం జీవితంలో మర్చిపోలేను- జైలు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు

నిజం గెలవాలి అనే పోరాటంలో మద్దతుగా నిలిచిన ప్రతి సోదరుడికి, ప్రతి మహిళకు, ప్రతి పౌరుడికి శిరసు వంచి కృతజ్ఞతలు చెబుతున్నా. నా భర్త అరెస్టుతో 53 రోజులుగా ఇక్కడే బస చేసిన నన్ను మీ ఇంటి బిడ్డలా చూసుకున్న రాజమహేంద్రవరం ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. ఆ దేవుడి దయతో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేశారు భుననేశ్వరి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. మంగళవారం(అక్టోబర్ 31) సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు వారాల అనంతరం నవంబర్ 28న సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ అవ్వాలని చంద్రబాబుని ఆదేశించింది కోర్టు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Also Read : జైలు నుంచి బయటకు రాగానే తాత చంద్రబాబును హత్తుకున్న దేవాన్ష్

 

 

చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కూడా తన తండ్రి విడుదలపై స్పందించారు. ఎట్టకేలకు మన ప్రార్థనలు ఫలించాయి. ఆయన ఇంటికి తిరిగొస్తున్నారు అని ట్వీట్ చేశారు లోకేశ్.