Nara Devansh : జైలు నుంచి బయటకు రాగానే తాత చంద్రబాబును హత్తుకున్న దేవాన్ష్

చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే.. ఆయన మనవడు దేవాన్ష్ తాతను హత్తుకున్నారు. చంద్రబాబు కూడా ఎంతో ప్రేమగా మనవడిని దగ్గరికి తీసుకున్నారు. Devansh With Chandrababu Naidu

Nara Devansh : జైలు నుంచి బయటకు రాగానే తాత చంద్రబాబును హత్తుకున్న దేవాన్ష్

Devansh With Chandrababu Naidu

Updated On : October 31, 2023 / 7:05 PM IST

Devansh With Chandrababu Naidu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. 52 రోజుల తర్వాత చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరికి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు.. పార్టీ అధినేతకు ఘన స్వాగతం పలికాయి.

కాగా, చంద్రబాబు జైలు నుంచి బయటకు రాగానే.. తొలుత తన మనవడు దేవాన్ష్ ని కలిశారు. దేవాన్ష్ ని చూడగానే చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. దేవాన్ష్ తన తాతను హత్తుకున్నాడు. చంద్రబాబు కూడా ఎంతో ప్రేమగా మనవడిని దగ్గరికి తీసుకున్నారు. దేవాన్ష్ ని ఆయన ముద్దాడారు. దేవాన్ష్ వెంట నారా బ్రాహ్మణి, బాలకృష్ణ ఉన్నారు. వారిని కూడా చంద్రబాబు పలకరించారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలను పలకరించారు చంద్రబాబు. అనంతరం భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల

అనారోగ్య కారణాలతో హైకోర్టు చంద్రబాబుకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. నాలుగు వారాల అనంతరం నవంబర్ 28న సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ అవ్వాలని చంద్రబాబుని ఆదేశించింది కోర్టు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

చంద్రబాబు జైలు నుంచి విడుదల కానున్నారు అనే విషయం తెలియగానే టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో జైలు వద్ద కోలాహలం నెలకొంది. చంద్రబాబును చూడగానే టీడీపీ శ్రేణుల్లో భావోద్వేగాలు మిన్నంటాయి. జై చంద్రబాబు నినాదాలతో జైలు పరిసరాలు మార్మోగాయి.

Also Read : మీరు చూపిన అభిమానం జీవితంలో మర్చిపోలేను- జైలు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు