Chandrababu Release : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల
అనారోగ్య కారణాలతో హైకోర్టుకు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. Chandrababu Release

Chandrababu Naidu Released From Jail
Chandrababu Released From Jail : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు వారాల అనంతరం నవంబర్ 28న సాయంత్రం 5 గంటల్లోపు సరెండర్ అవ్వాలని చంద్రబాబుని ఆదేశించింది కోర్టు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
జై చంద్రబాబు నినాదాలతో మార్మోగిన జైలు పరిసరాలు..
చంద్రబాబు జైలు నుంచి విడుదల కానున్నారు అనే విషయం తెలియగానే టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో జైలు వద్ద కోలాహలం నెలకొంది. చంద్రబాబును చూడగానే టీడీపీ శ్రేణుల్లో భావోద్వేగాలు మిన్నంటాయి. జై చంద్రబాబు నినాదాలతో జైలు పరిసరాలు మార్మోగాయి.
Also Read : మీరు చూపిన అభిమానం జీవితంలో మర్చిపోలేను- జైలు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు
చంద్రబాబుకి హైకోర్టు షరతులు..
చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చాక పార్టీ శ్రేణులకు, అభిమానులకు అభివాదం చేశారు. అచ్చెన్నాయుడు, తదితర ముఖ్యనేతలతో చంద్రబాబు మాట్లాడారు. జైలు నుంచి వెలుపలికి వచ్చిన చంద్రబాబును చూడగానే టీడీపీ నేతల్లో ఆనందం పొంగిపొర్లింది. ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాగా, చంద్రబాబుకి పలు షరతులు విధించింది కోర్టు. రేపటి వరకు చంద్రబాబు ఎటువంటి ర్యాలీలు చేయకూడదని, మీడియాతో మాట్లాడొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
జైలు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు మాటలు..
జైలు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు మాట్లాడారు. నాపై మీరు చూపిన అభిమానం జీవితంలో మర్చిపోలేను అని అన్నారు. నా రాజకీయ జీవితంలో ఏనాడు తప్పు చేయలేదు, చేయను, ఎవరినీ చేయనివ్వను అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన మద్దతు, సంఘీభావం చూసి తన జీవితం ధన్యమైందన్నారు చంద్రబాబు.
తనకు అండగా నిలిచిన ప్రజలకు, రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. మరీ ముఖ్యంగా జనసేనకు, పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారాయన. కార్యకర్తలు, ప్రజలు చూపిన అభిమానాన్ని ఎప్పటికీ మరువను అని జైలు నుంచి బయటకు వచ్చాక తన తొలి ప్రసంగంలో పేర్కొన్నారు చంద్రబాబు. కాగా, కోర్టు ఆదేశాలతో స్కిల్ స్కామ్ కేసుపై చంద్రబాబు మాట్లాడలేదు. ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు.
Also Read : జైలు నుంచి బయటకు రాగానే తాత చంద్రబాబును హత్తుకున్న దేవాన్ష్
రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తొలుత తన మనవడు దేవాన్ష్ ని కలిశారు. ప్రేమతో దేవాన్ష్ ని దగ్గరికి తీసుకున్నారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు సహా పలువురు టీడీపీ నేతలను కలిశారు. భారీగా చేరుకున్న పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Chandrababu Comes Out From Jail