Devansh Video: చదరంగంలో లోకేశ్‌ తనయుడు దేవాన్ష్ ప్రపంచ రికార్డు

దేవాన్ష్‌ ఈ రికార్డును నెలకొల్పడంపై నారా లోకేశ్ స్పందిస్తూ.. ఈ గేమ్‌ను తన కుమారుడు చాలా ఇష్టంగా ఆడేవాడని చెప్పారు.

Devansh Video: చదరంగంలో లోకేశ్‌ తనయుడు దేవాన్ష్ ప్రపంచ రికార్డు

Updated On : December 22, 2024 / 8:16 PM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడి మనవడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ (9) కుమారుడు దేవాన్ష్ చెస్‌లో వేగంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ మేరకు వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్-175 పజిల్స్‌లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ దేవాన్ష్‌కు సర్టిఫికెట్ ఇచ్చింది.

దేవాన్ష్‌ ఈ రికార్డును నెలకొల్పడంపై నారా లోకేశ్ స్పందిస్తూ.. ఈ గేమ్‌ను తన కుమారుడు చాలా ఇష్టంగా ఆడేవాడని చెప్పారు. గ్లోబల్‌ అరేనాలో భారతీయ చెస్‌ క్రీడాకారుల నుంచి దేవాన్ష్ ప్రేరణ పొందాడని తెలిపారు. కొన్ని వారాలుగా దేవాన్ష్ రోజుకు 5-6 గంటలు శిక్షణ తీసుకున్నాడని చెప్పారు. మరెన్నో విజయాలు సాధించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

దీనిపై నారా బ్రాహ్మణి స్పందిస్తూ.. “ఈ విషయాన్ని చెబుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దేవాన్ష్ వేగవంతమైన చెక్‌మేట్ సోల్వర్ – 175 పజిల్స్ లో ప్రపంచ రికార్డును సాధించాడు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అధికారికంగా సర్టిఫికెట్ స్వీకరించాడు. సంవత్సరాల తరబడి దేవాన్ష్ అంకితభావం, పట్టుదలను చూడడం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ అద్భుతమైన విజయానికి మార్గనిర్దేశం చేసిన కోచ్ కె రాజశేఖర్ రెడ్డి, రాయ్ అకాడమీకి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని చెప్పారు.

Domalaguda Robbery Case : హైదరాబాద్ దోమలగూడ భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు..