నీళ్లు, బిస్కెట్లు కూడా ఇవ్వలేదు : ఈసీపై లోకేష్ ఫైర్

అమరావతి: మంగళగిరి నియోజక వర్గం తాడేపల్లిలో, మంగళగిరి టీడీపీ అభ్యర్ధి నారా లోకేష్ ఆందోళనకు దిగారు. క్రిస్టియన్ పేట పోలింగ్ బూతవద్ద ఈసీ తీరుకు నిరసనగా ఆయన ఆందోళన చేపట్టారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలం అయ్యిందని ఆయన ఆరోపించారు. ఓటు వేయటానికి వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించ లేదన్నారు. ఓటర్లను ఈసీ అసలు పట్టించుకోలేదని, ఎన్నికల సంఘం ఎక్కుడుందని ఆయన ప్రశ్నించారు. .
ఓట్లు వేయడానికి వచ్చినవారికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని, ఏపీలో పోలింగ్ శాతం తగ్గటానికి ఈసీనే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. గంటపాటు ఈవీఎంలు మొరాయించినా అధికారులు ల పట్టించుకోలేదని ఆయన అన్నారు. వీవీ ప్యాట్ లు పని చేయకపోతే వాటిని మార్చటానికి గంటలకొద్దీ టైమ్ తీసుకున్నారని ఆయన ఆరోపించారు.