Chandrababu Bail: చంద్రబాబు ఎప్పుడూ చెప్పేదే మరోసారి నిజమైంది .. బెయిల్ పై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేసులో ఆరోపించినట్లు షెల్ కంపెనీలు అనేవి లేవని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయనేది పచ్చి అబద్ధమని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూటకమని స్పష్టమైందని నారా లోకేశ్ అన్నారు.

Nara Lokesh
Nara Lokesh : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు బెయిల్ రావడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ‘సత్యమేవజయతే’ మరోసారి నిరూపితమైంది. ఆలస్యమైనా సత్యమే గెలిచిందని అన్నారు. చంద్రబాబు నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం మరోసారి సమున్నతంగా తలఎత్తుకొని నిలబడింది. నేను తప్పు చేయను, తప్పు చెయ్యనివ్వను అంటూ చంద్రబాబు ఎప్పుడూ చెప్పేదే మరోసారి నిజమైందని లోకేశ్ అన్నారు. బాబుపై పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు, జగన్ కోసం.. జగన్ వ్యవస్థల ద్వారా బనాయించిందని బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది. అరెస్టు చేసి 50రోజులకుపైగా జైలులో పెట్టారు. కనీసం ఒక్క ఆధారం ఇప్పటికీ కోర్టు ముందు ఉంచలేకపోయారు. తప్పుడు కుట్రలు న్యాయం ముందు బద్దలయ్యాయంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.
Also Read : Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట..
కేసులో ఆరోపించినట్లు షెల్ కంపెనీలు అనేవి లేవని తేలిపోయింది. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి డబ్బులు పడ్డాయనేది పచ్చి అబద్ధమని, వాట్సాప్ మెసేజ్ చాట్ అంతా బూటకమని స్పష్టమైందని నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబు నాయుడుకు రూపాయికూడారాని స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకోసం అధికారులపై ఒత్తిడి తెచ్చారనేది అవాస్తవమని న్యాయస్థానమే తేల్చేసిందని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీంను స్కాంగా మార్చేసి చంద్రబాబు 45ఏళ్ల క్లీన్ పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి జగన్ అండ్ కో పన్నాగమని దేశమంతటికీ తెలిసింది. హైకోర్టు వ్యాఖ్యలతో కడిగిన ముత్యంలా మా చంద్రబాబు ఈ కుట్రకేసులన్నింటినీ జయిస్తారు. సత్యం గెలిచింది. జగన్ అనే అసత్యంపై యుద్ధం ఆరంభం కానుందని లోకేశ్ చెప్పారు.
Also Read : Australia : ఏపీకి రానున్న ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా.. ఎందుకో తెలుసా..?
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేయడంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబుకు బెయిల్ రావడంతో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలతోపాటు పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా అందుకు సంబంధించిన కోర్టు తీర్పు పత్రాలను నారా లోకేశ్ ట్విటర్ షేర్ చేశారు.
https://twitter.com/naralokesh/status/1726556164220187000