Nara lokesh: కుప్పం ప్రచారానికి నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో పర్యటించబోతున్నారు.

Nara Lokesh
Nara lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో పర్యటించబోతున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో నేడు, రేపు పాల్గొననున్నారు నారా లోకేష్.
ఉదయం 7గంటల 30నిమిషాలకు స్థానిక నేతలతో సమావేశమై లోకేష్ ఎన్నికలపై చర్చించనున్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వెయ్యాలని అభ్యర్థించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతుండగా.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కుప్పం ఎన్నికల్లో వాతావరణం హీటెక్కింది.