Narasaraopet MP Candidate: బరిలో అనిల్ కుమార్ యాదవ్.. నరసరావుపేట పంచాయితీకి పుల్‌స్టాప్‌ పెట్టిన జగన్‌

ప్రస్తుతం నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు సీఎం జగన్ నిర్ణయించారు.

Narasaraopet MP Candidate: బరిలో అనిల్ కుమార్ యాదవ్.. నరసరావుపేట పంచాయితీకి పుల్‌స్టాప్‌ పెట్టిన జగన్‌

Anil Kumar Yadav

Updated On : January 26, 2024 / 2:41 PM IST

Anil Kumar Yadav : నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిపై కొన్నిరోజులుగా జరుగుతున్న పంచాయితీకి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ నియోజకవర్గం నుంచి జగన్ ఆదేశాలతో నెల్లూరి సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. నరసరావుపేట పార్లమెంట్ బరిలో బీసీ అభ్యర్థిని దింపాలని వైసీపీ అధిష్టానం మొదటి నుంచి భావిస్తోంది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎంపీగాఉన్న శ్రీకృష్ణ దేవరాయులుకు గుంటూరు వెళ్లాలని సీఎం జగన్  సూచించారు.. అయితే, శ్రీకృష్ణ దేవరాయులు మాత్రం ఖచ్చితంగా తాను నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని చెప్పినప్పటికీ.. అందుకు జగన్ అంగీకరించలేదని తెలిసింది. దీంతో వైసీపీ పార్టీ సభ్యత్వానికి , ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు గత మూడ్రోజుల క్రితం శ్రీకృష్ణ దేవరాలయులు ప్రకటించారు. అయితే, బీసీ అభ్యర్థిని, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గంకు చెందిన అభ్యర్థిని నరసరావుపేట నుంచి బరిలో దింపాలని వైసీపీ అధిష్టానం భావిస్తుండటంతో ముగ్గురు నలుగురు పేర్లుకూడా పరిశీలనలోకి వచ్చాయి.

Also Read : Pawan Kalyan : పొత్తుపై స్వరం మార్చిన పవన్.. తాను చెప్పాల్సింది క్లారిటీగా చెప్పేశారా!

ప్రస్తుతం నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు సీఎం జగన్ నిర్ణయించారు. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిశారు. నరసరావుపేట పార్లమెంట్ స్థానం పోటీ చేయాలని అనిల్ కు జగన్ క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్ సైతం జగన్ చెప్పడంతో నరసరావుపేట పార్లమెంట్ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు  నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై అనిల్ కుమార్ కు జగన్ చాయిస్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో నెల్లూరు సిటీ అభ్యర్థిపై మరో రెండుమూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి గత కొద్దిరోజులుగా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న పంచాయతీకి జగన్ అనిల్ కుమార్ యాదవ్ తో చెక్ పెట్టారు.