SC Commission : మత మార్పిళ్లు.. ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్
ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మత మార్పిడులపై నివేదిక పంపడంలో జాప్యం చేస్తోందని సీరియ్ అయ్యింది. ఏపీలో భారీగా మత మార్పిడులు జరుగుతున్నాయని కమిషన్‌కు..

National Sc Commission
National SC Commission : ఏపీ ప్రభుత్వంపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మత మార్పిడులపై నివేదిక పంపడంలో జాప్యం చేస్తోందని సీరియ్ అయ్యింది. ఏపీలో భారీగా మత మార్పిడులు జరుగుతున్నాయని కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని గత జూన్‌లో ఏపీ సీఎస్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ లేఖ రాసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించ లేదు. మరోసారి ఏపీ సీఎస్‌కు ఎస్సీ కమిషన్ లేఖ రాసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
హైదరాబాద్ లోని ఎస్సీ, ఎస్టీ రైట్స్ ఫోరమ్ జాతీయ అధ్యక్షుడు నాగరాజ జాతీయ ఎస్సీ కమిషన్ కు లేఖ రాశారు. ఏపీలో పెద్ద ఎత్తున మత మార్పిళ్లు జరుగుతున్నాయని, ప్రలోభ పెట్టి క్రిస్టియానిటీలోకి కన్వర్షన్ చేస్తున్నారంటూ పెద్దఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. ఆయనతో పాటు అనేక ఫిర్యాదులు జాతీయ ఎస్సీ కమిషన్ కు అందాయి. ఈ వ్యవహారాన్ని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సీరియస్ గా తీసుకుంది. ఏపీ సీఎస్ కు గతంలోనే ఓ లేఖ రాసింది. దీనిపై సవివరణమైన నివేదిక ఇవ్వాలని కోరింది.
Read More CBI : చైల్డ్ పోర్న్ రాకెట్‌పై సీబీఐ మెరుపు దాడి
కానీ, ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో, జాతీయ ఎస్సీ కమిషన్ ఏపీ సీఎస్ కు మరో లేఖ రాసింది. ఏడు రోజుల్లోగా ఏపీలో జరుగుతున్న మత మార్పిళ్లకు కారణాలు ఏంటి? ఎవరెవరిని మత మార్పిడి చేశారు? పేదలను ఎందుకు ప్రలోభ పెడుతున్నారు? ఏ విధంగా ప్రలోభ పెడుతున్నారు? ఈ వివరాలన్నింటితో పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని ఏపీ సీఎస్ ని ఎస్సీ కమిషన్ కోరడం జరిగింది. గతంలో కోరిన వివరాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదని, అందుకే మరోసారి రిమైండర్ పంపుతున్నాం, ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే న్యాయపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకుంటాం అంటూ జాతీయ ఎస్సీ కమిషన్ ఏపీ సీఎస్ కు రాసిన లేఖలో తెలిపింది.