నా భార్య, పిల్లలను అసభ్యకరమైన వీడియోలతో వేధించారు- కంటతడి పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే

పోలింగ్ రోజున 5 నిమిషాలకు 10 నిమిషాలకు వీడియోలు పంపారు. ప్రచారం అయిపోయిందని వాట్సాప్ ఆన్ చేస్తే మళ్లీ వెంటనే వీడియోలు పెట్టారు.

నా భార్య, పిల్లలను అసభ్యకరమైన వీడియోలతో వేధించారు- కంటతడి పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే

Kotamreddy Sridhar Reddy : ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారని, చాలా దారుణంగా వ్యవహరించారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. అసభ్యకరమైన వీడియోలు పంపుతూ నా భార్య, పిల్లలను వేధించారని ఆయన కన్నీటిపర్యంతం అయ్యారు. అరగంటకు అరగంటకు నా భార్య, కుమార్తెల వాట్సాప్ లకు వీడియోలు పంపి టార్చర్ పెట్టారని ఆయన వాపోయారు. దీనికి కారణం వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి అని కోటంరెడ్డి ఆరోపించారు. దీనికి ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురిచేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి కంటతడి పెట్టారు. రాత్రిళ్లు తన కుటుంబం ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయని కోటంరెడ్డి ఆవేదన చెందారు.

”నేను ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. నా భార్య, నా కుమార్తెలను పట్టుకుని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో నెల రోజుల పాటు అరగంట అరగంటకి నా భార్య, నా కుమార్తెల ఫోన్ నెంబర్లకు రకరకాల వీడియోలు పెట్టారు. ఇవన్నీ భరించలేక వాట్సాప్ లు బ్లాక్ చేసుకున్నారు. మీ దగ్గర డబ్బు ఉంది, అధికార మదం ఉంది. నా తండ్రి స్థానంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. నా భార్య, నా కుమార్తెలు నీకు ఏం ద్రోహం చేశారు?

పోలింగ్ రోజున 5 నిమిషాలకు 10 నిమిషాలకు వీడియోలు పంపారు. ప్రచారం అయిపోయిందని వాట్సాప్ ఆన్ చేస్తే మళ్లీ వెంటనే వీడియోలు పెట్టారు. అంత మానసిక క్షోభ పెట్టింది ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టాడని ఆయన కుడి భుజం, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవీ రామిరెడ్డి స్వయంగా చెప్పారు. దీనికి ఆదాల ఏం సమాధానం చెబుతారు? దీనికి ఆదాల సమాధానం చెప్పి తీరాలి.

నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడలేదు. నా కుటుంబాన్ని వేధించినా నేను భరించా. ప్రజలకు భయపడ్డా. నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు, నేను వాళ్ల ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రీకరించాలని చూశారు. చివరికి పోలింగ్ రోజున పసుపు కలర్ ప్యాంట్ వేసుకుని పోతే చించేశారు. పోలింగ్ బూత్ కు ఎల్లో ప్యాంట్ తీసుకెళ్లకూడదని రూల్ ఏమైనా ఉందా? ఒకవేళ ఆ రూల్ ఉంటే.. పోలింగ్ బూత్ లో పైన ఫ్యాన్ ఉండొచ్చా? రోడ్లపై సైకిళ్లు తిరగొచ్చా? టీ బంకుల దగ్గర గాజు గ్లాసు ఉండొచ్చా? ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయిరెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, చిల్లర రౌడీల్లా వ్యవహరించారు.

నన్ను రెచ్చగొట్టడానికి వారు పన్నిన వ్యూహం అది. వాళ్లు రెచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా. కోటంరెడ్డి రౌడీ, గూండా, దుర్మార్గుడు అని ప్రచారం చేసేందుకు రెడీగా ఉన్నారు. నేను మా వాళ్లందరికీ ఫోన్ చేశా. ఎవరూ ఉద్రేకపడొద్దని చెప్పారు. వాళ్లు కొడితే దెబ్బ తినండి. దెబ్బ తీసుకుందాం. తిరిగి దానికి ఏం సమాధానం చెప్పాలో నా దగ్గర ప్రణాళిక సిద్దంగా ఉందని మా వాళ్లందరితో చెప్పా” అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

Also Read : రాజకీయాలకు పనికి రారని తిట్టారు, జనసేన మూసేయాలని విమర్శించారు.. కట్ చేస్తే..