పెళ్లైన 3 రోజులకే గోదావరిలో దూకి నవ వధువు మృతి.. భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్న బాధితురాలి ఫ్యామిలీ
గోదావరిలో ఆత్మహత్యాయత్నం చేసిన నవ జంట విషయంలో నవ వధువు బంధువులు భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. పథకం ప్రకారమే భార్య సత్యవతిని భర్త శివరామకృష్ణ సినిమాకి అని తీసుకెళ్లి కొట్టి చంపి గోదావరిలో పడేశారని మృతురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

new bride died
West Godavari New Bride Died : పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం బ్రిడ్జిపై నుండి గోదావరిలో దూకిన నవ వధువు సత్యవతి మృతి చెందారు. అధికారులు సత్యవతి మృతదేహాన్ని వెలికి తీశారు. రెండు రోజుల క్రితం భార్యాభర్తలిద్దరూ కలిసి గోదావరిలో కొట్టుకుపోతూ దొరికారు. స్థానిక జాలర్లు భర్తను కాపాడారు. పోలీసులు సత్యవతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నవ జంట గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనపై పెనుగొండ పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
గోదావరిలో ఆత్మహత్యాయత్నం చేసిన నవ జంట విషయంలో నవ వధువు బంధువులు భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. పథకం ప్రకారమే భార్య సత్యవతిని భర్త శివరామకృష్ణ సినిమాకని తీసుకెళ్లి.. కొట్టి చంపి గోదావరిలో పడేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిశ్చితార్థం అయిన దగ్గర నుండి ఎంతో ఇష్టంగా ఉన్నామంటూ నమ్మించాడని మృతురాలి కుటుంబ సభ్యులు అంటున్నారు.
Also Read : అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు
పెళ్లైన మూడో రోజునే ఇలా చేయడంపై మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన భార్యకు తానంటే ఇష్టం లేదని పేర్కొనడంపై మృతురాలి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెనుగొండ పోలీసులు అనుమానాస్పద కేసు కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.