Maoists : అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

శుక్రవారం జరుగబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. బీజేపీని గద్దే దించాలని పిలుపునిచ్చారు.

Maoists : అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాహనాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు

Maoists

Updated On : December 21, 2023 / 9:58 AM IST

Alluri Sitamaraju Maoists : ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో హల్ చల్ చేశారు. చింతూరు మండలం వీరాపురంలో మావోయిస్టులు వాహనాలకు నిప్పు పెట్టారు. రేపటి(శుక్రవారం) బంద్ ను విజయవంతం చేయాలని బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక మావోయిస్టుల దుశ్చర్యతో చింతూరు ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు.

బుధవారం రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో చింతూరు మండలంలో మావోలు ఒక కారుకు నిప్పు పెట్టి తమ నిరసనను తెలిపారు. శుక్రవారం జరుగబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. బీజేపీని గద్దే దించాలని పిలుపునిచ్చారు. దీంతో చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జాతీయ రహదారిపై సుమారు మూడు గంటల నుంచి నాలుగు గంటలపాటు ట్రాఫిక్ జామ్ అయింది.

CM Jagan : అల్లూరి సీతారామరాజు జిల్లాలో జగన్ పర్యటన.. విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ

దేశంలో ఎన్ఐఏ సంస్థను రద్దు చేయాలని, జైల్లో ఉన్న ఆదివాసీలందరినీ వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా మావోయిస్టులపై జరుగుతున్న అక్రమ ఎన్ కౌంటర్లను వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఎన్ కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలని మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాల్లో పేర్కొన్నారు.