CM Jagan : అల్లూరి సీతారామరాజు జిల్లాలో జగన్ పర్యటన.. విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు రూ. 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లు ఏపీ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది.

CM Jagan (File Photo)
Tabs For Students: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లు ఉచిత పంపిణీని జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం జగన్ ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్ లో చౌడుపల్లిలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో చింతపల్లి వెళ్తారు. ముందుగా అదే ప్రాంతంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శిస్తారు. విద్యార్థులతో ముచ్చటిస్తారు. అనంతరం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేస్తారు. అక్కడ నుంచి డిగ్రీ కళాశాల మైదానంలోని సభకు సీఎం వెళ్తారు. సభ ముగిసిన అనంతరం తిరిగి చౌడుపల్లి హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడ కొద్ది సేపు వైసీపీ నేతలతో మాట్లాడతారు. అనంతరం హెలికాప్టర్ లో విశాఖ బయలుదేరి వెళ్తారు.
Also Read : Group 2 Jobs : గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. వయసు, విద్యార్హతలు ఇవే
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 4,34,185 మంది విద్యార్థులకు రూ. 620 కోట్ల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లు ఏపీ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. వీటి పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చింతపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 33వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. దాదాపు రూ. 17,500పైగా మార్కెట్ విలువ గల ట్యాబ్, దాదాపు రూ. 15,500 విలువ గల బైజూస్ కంటెంట్ తో కలిపి ప్రతి 8వ తరగతి విద్యార్థికి అందించనున్నారు. ప్రస్తుతం అందిస్తున్న 4,34,185 ట్యాబ్ లతో కలిపి ఇప్పటి వరకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, బోధిస్తున్న ఉపాధ్యాయులకు రూ. 1,305.74 కోట్ల వ్యయంతో 9,52,925 ట్యాబ్ లు అందజేసినట్లవుతుంది.
Also Read : Chandrababu Naidu: అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది.. రాష్ట్రం మొత్తం..: చంద్రబాబు
8వ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్లినప్పుడు కూడా ఈ ట్యాబ్ లు ఉపయోగపడేలా 8వ తరగతితో పాటు 9, 10 తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసి ట్యాబ్ లు అందజేయనున్నారు. ఇప్పుడు అందించే ట్యాబ్ లలో 11, 12 తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం 256 జీబీకి పెంచి ప్రభుత్వం అందిస్తుంది.