Chandrababu Naidu: అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయింది.. రాష్ట్రం మొత్తం..: చంద్రబాబు
రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. మెడపై కత్తి పెట్టి ఆస్తులు లాక్కుంటున్నారని చెప్పారు.

Chandrababu Naidu
Chandrababu Naidu: సీఎం జగన్ పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి విధ్యంసమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం పేరుతో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడారు.
పాదయాత్రలో లోకేశ్ ప్రజల సమస్యలను అధ్యయనం చేశారని చంద్రబాబు అన్నారు. ఒక్క చాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. మెడపై కత్తి పెట్టి ఆస్తులు లాక్కుంటున్నారని చెప్పారు. ఉత్తరాంధ్ర వైసీపీ కబ్జాలో నలిగిపోయిందన్నారు.
చంద్రబాబు కామెంట్స్
- రివర్స్ పాలన అన్నారు.. విధ్వంస పాలన చేస్తున్నారు
- విధ్వంస పాలనకు జగన్ నాంది పలికారు
- ఒక్క చాన్స్ అన్నారు.. ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు
- వైసీపీ విముక్తాంధ్రప్రదేశే టీడీపీ-జనసేన లక్ష్యం
- గతంలో విశాఖ ఆర్థిక రాజధానిగా ఉండేది
- ప్రస్తుతం విశాఖ గంజాయి రాజధానిగా మారింది
- టీడీపీ అధికారంలో ఉంటే పోలవరం పూర్తయ్యేది
- వైసీపీ పాలనలో కంపెనీలు పారిపోయే పరిస్థితి నెలకొంది
- రాజకీయాల్లో ఉండే అర్హత జగన్‌కు లేదు
- కురుక్షేత్ర యుద్ధంలో విజయం మాదే
- దేశంలో పాదయాత్రలు కొత్తకాదు.. ఎంతోమంది పాదయాత్రలు చేశారు
- కానీ యువగళం పాదయత్రంపై సైకో జగన్ దండయాత్ర చేశారు
- ఈ సీఎం ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ అయినా నెరవేర్చారా?
- జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు
- యువతకు టీడీపీ, జనసేన ఉద్యోగ భరోసా ఇస్తాయి
- మా ప్రభుత్వ హయాంలోనే భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేశాము
- మేము అధికారంలో ఉంటే 2020 కే పూర్తిచేసేవాళ్లం
- జగన్ రెండోసారి సంకుస్థాపన చేశారు
- అన్ని వ్యవస్థలూ నాశనం చేశారు
- అమరావతి, తిరుపతిలో భారీ బహిరంగ సభలు త్వరలోనే నిర్వహిస్తాం
- రెండు సభల్లో ఏదో ఒక చోట ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం
- తెలుగుదేశం – జనసేన పొత్తుతో వైసీపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతే
- వచ్చే 5 ఏళ్లలో ఎక్కడాలేని అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకుంటాం
- వైసీపీ పెద్దలు తప్పు చేయాలని చెబితే.. చేసేసిన అధికారుల్ని వదిలి పెట్టం
- రాష్ట్రంలో టీడీపీ-జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారు
- ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్టు సరిచూసుకోండి
Nara Lokesh : ఇక మూడు నెలలే.. వైసీపీ ప్రభుత్వం అంతిమ యాత్ర డేట్ ఫిక్స్ అయ్యింది- నారా లోకేశ్