Nara Lokesh : ఇక మూడు నెలలే.. వైసీపీ ప్రభుత్వం అంతిమ యాత్ర డేట్ ఫిక్స్ అయ్యింది- నారా లోకేశ్

జగన్ ది రాజారెడ్డి పొగరైతే, లోకేశ్ ది అంబేద్కర్ రాజ్యాంగ పౌరుషం. చంద్రబాబు విజనరీ, జగన్ ప్రిజనరీ. ప్రజల జీవితాలతో ఇప్పటికే ఆటలాడుకున్న జగన్ ఆడుదాo ఆంధ్రా అంటున్నారు.

Nara Lokesh : ఇక మూడు నెలలే.. వైసీపీ ప్రభుత్వం అంతిమ యాత్ర డేట్ ఫిక్స్ అయ్యింది- నారా లోకేశ్

Nara Lokesh

Updated On : December 20, 2023 / 8:52 PM IST

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు నారా లోకేశ్. విశాఖ‌ని క్యాపిట‌ల్ చేస్తానంటూ క్రైమ్ క్యాపిట‌ల్ చేశారు. పరిపాల‌నా రాజ‌ధాని చేస్తాన‌ని క‌బ్జాల రాజ‌ధాని చేశారు. భూములు, చెరువులను కబ్జా చేశారు. వైసీపీ నాయకులు కోట్లు కొట్టేశారు అంటూ విరుచుకుపడ్డారు నారా లోకేశ్. ఇక మూడు నెలలే, వైసీపీకి అంతియ యాత్ర డేట్ ఫిక్స్ అయ్యింది అంటూ యువగళం-నవశకం బహిరంగ సభలో జగన్ సర్కార్ పై చెలరేగిపోయారు నారా లోకేశ్.

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం పేరుతో టీడీపీ భారీ బహిరంగ నిర్వహిస్తోంది. ఈ సభకు టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి.

Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?

”వచ్చే ఎన్నికలు జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య సాగే యుద్ధం. నవశకం బొమ్మ బ్లాక్ బాస్టర్. ఒకే వేదికపై ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలయ్యలను చూస్తే తాడేపల్లి ప్యాలెస్ టీవీలు పగులుతాయి. తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు యువగళం ఆగదు. నాకు ఎన్టీఆర్ ప్రసాదించిన గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టడు కూడా. జగన్ ది రాజారెడ్డి పొగరైతే, లోకేశ్ ది అంబేద్కర్ రాజ్యాంగ పౌరుషం. చంద్రబాబు విజనరీ, జగన్ ప్రిజనరీ. ప్రజల జీవితాలతో ఇప్పటికే ఆటలాడుకున్న జగన్ ఆడుదాo ఆంధ్రా అంటున్నారు. జగన్ ఐపీఎల్ టీమ్ అంటూ పెడితే, దాని పేరు కోడికత్తి వారియర్స్. పాదయాత్రతో ఎన్నో పాఠాలు నేర్చుకున్నా. జగన్ చేసిన విధ్వంసం అడుగడుగునా కనిపించింది. గుంతల్లో రోడ్డు ఎక్కడుందా అని వెతుక్కుంటూ నడిచా.

రాయలసీమ జిల్లాల ప్రజలు పడుతున్న కష్టాలు చూశాక మిషన్ రాయలసీమ ప్రకటించాను. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాము. హార్టికల్చర్ హబ్ గా త‌యారు చేస్తాం. స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారుస్తాం. ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా మారుస్తాం. నెల్లూరులో ఆక్వా రైతుల కష్టాలు చూశాను. ఆక్వా, నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా రూ.1.50కే యూనిట్ విద్యుత్ అందిస్తాం. ప్రజా రాజధాని అమరావతి పూర్తి చేస్తాం. మిర్చి, పత్తి రైతులను ఆదుకుంటాం. ఉభయగోదావరి జిల్లాల్లో ఆక్వా, కొబ్బరి, వరి, పామ్ ఆయిల్ రైతులకు గతంలో ఇచ్చిన సబ్సిడీలు ఇస్తాం. మేజర్ రోడ్లన్నీ సీసీ రోడ్లు వేస్తాం. 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని జగన్ గాలికి వదిలేశారు.

Also Read : మంత్రి రోజాకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్‌లు.. పెద్దిరెడ్డి ఇంటి నుంచి మరొకరికి టికెట్?

కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఐటీ కంపెనీలన్నీ పక్క రాష్ట్రానికి పరార్. విశాఖ‌ని క్యాపిట‌ల్ చేస్తానంటూ క్రైమ్ క్యాపిట‌ల్ చేశారు. పరిపాల‌నా రాజ‌ధాని చేస్తాన‌ని క‌బ్జాల రాజ‌ధాని చేశారు. దసపల్లా భూములు, సీఎన్ బీసీ భూములు, హయగ్రీవ భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, స్వతంత్ర సమరయోధుల భూములు, శివారు ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేశారు. లూలూని తరిమేశారు. ఆ భూములు కొట్టేశారు. టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో వేల కోట్లు వైసీపీ నాయకులు కొట్టేశారు.

రుషికొండకు గుండు కొట్టి 500 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నారు. ఏ2 విజయసాయి రెడ్డి విశాఖను నాశనం చేశారు. ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి విశాఖ మన్యంలో లేటరైట్‌, బాక్సైట్‌ ను దోచుకుంటున్నారు. జీవీఎంసీ అవినీతికి అడ్డాగా మారిపోయింది. చెత్త ట్యాక్స్ తప్ప ఒక్క రోడ్డు వెయ్యరు, ఒక్క డ్రైనేజ్ కట్టరు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ ను జగన్ చంపేశాడు. రాయితీలు ఇవ్వకపోవడంతో విజయనగరం జిల్లాలో ఉన్న 31కి పైగా ఫెర్రో అల్లా యిస్ పరిశ్రమలు మూతపడ్డాయి.

Also Read : జగన్ ఐపీఎల్ టీమ్ ఇదే..!- ప్లేయర్లు ఎవరెవరో చెప్పిన నారా లోకేశ్

మూడే మూడు నెలలు వైసీపీకి అంతిమయాత్ర డేట్ ఫిక్స్ అయ్యింది. తెలుగుదేశం కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. వడ్డీతో సహా చెల్లిస్తాం. చట్టాన్ని ఉల్లఘించిన వారి పేర్లన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయి. వారికి శిక్ష తప్పదు. ప్రకాశం జిల్లాను ఎడారిగా మార్చేశారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. జగన్ ని చూస్తూ అప్పుల అప్పారావు గుర్తుకొస్తాడు” అని నారా లోకేశ్ నిప్పులు చెరిగారు.