Nara Lokesh : జగన్ ఐపీఎల్ టీమ్ ఇదే..!- ప్లేయర్లు ఎవరెవరో చెప్పిన నారా లోకేశ్

జగన్ కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఆడుదాం ఆంధ్ర అట. ప్రజలను అడిగా దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని. మా జీవితాలతో ఆడాడు చాలు బాబు. ఈ కార్యక్రమం మాకు వద్దే వద్దు అన్నారు.

Nara Lokesh : జగన్ ఐపీఎల్ టీమ్ ఇదే..!- ప్లేయర్లు ఎవరెవరో చెప్పిన నారా లోకేశ్

Updated On : December 20, 2023 / 9:28 PM IST

ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ నేత నారా లోకేశ్. జగన్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు. ప్రజలు వైసీపీ పరిపాలనతో విసిగిపోయారని, రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని నారా లోకేశ్ అన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై సెటైర్లు వేశారు నారా లోకేశ్. జగన్ ఐపీఎల్ టీమ్ ఇదే అంటూ.. అందులో ప్లేయర్లు వీరే అంటూ వైసీపీ నాయకులను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు లోకేశ్.

”జగన్ కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఆడుదాం ఆంధ్ర అట. ప్రజలను అడిగా దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని. మా జీవితాలతో ఆడాడు చాలు బాబు. ఈ కార్యక్రమం మాకు వద్దే వద్దు అన్నారు. జగన్ ఒక ఐపీఎల్టీమ్ కూడా పెడతారట. ఆ ఐపీఎల్ టీమ్ పేరు కోడికత్తి వారియర్స్. ఆ ఐపీఎల్ లో టీమ్ మెంబర్స్.. సీనియర్ బ్యాట్స్ మెన్ అవినాశ్ రెడ్డి. బాబాయ్ ని గట్టిగా కొట్టాడు కదా. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, బూతుల స్టార్ కొడాలి నాని. పించ్ హిట్టర్ బియ్యపు మధుసూదన్ రెడ్డి. ఇది అద్భుతమైన ఐపీఎల్ టీమ్” అంటూ ఎద్దేవా చేశారు నారా లోకేశ్.

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చాయి.

Also Read: ఉచితాల మాయలో పడొద్దు, మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు- బాలకృష్ణ హెచ్చరిక