Nandamuri Balakrishna : ఉచితాల మాయలో పడొద్దు, మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు- బాలకృష్ణ హెచ్చరిక
చంద్రబాబు దూరదృష్టితో ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారు. ప్రపంచానికి, ఒక విజన్ కు ఆదర్శం చంద్రబాబు నాయుడు.

Nandamuri Balakrishna Powerful Speech
వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ. సీఎం జగన్ అన్ని రకాలుగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని బాలకృష్ణ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుధ్ధి చెప్పాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. వైసీపీలో సామాజిక న్యాయం లేదన్నారు.
”ఇది యువగళం ముగింపు సభ కాదు. ఇది ఆరంభం మాత్రమే. నవతరం రాజకీయాలకు ఆరంభం. యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. నటులు కేవలం సినిమాలకే పరిమితం కాదు. పవన్ కల్యాణ్ ను సినిమాల్లో కంటే ప్రజల్లో ఎక్కువ చూస్తున్నాము. ఎన్టీ రామారావు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. పేదవాడి ఆకలికి అండగా ఉన్నారు. రామారావు ప్రజలు గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. రాజధాని లేని చెత్త ప్రభుత్వం వైసీపీ. గంజాయి సాగులో ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రాన్ని ఓ సైకో పరిపాలన చేస్తున్నాడు.
ఏ రుణం పెట్టుకోకూడదు అని నాన్న గారు చెప్పేవారు. ప్రజల రుణం తీర్చుకుంటాం. చంద్రబాబు దూరదృష్టితో ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారు. దేశంలోనే తొలిసారిగా పొదుపు స్కీమ్ తీసుకొచ్చారు. ఆనాడు అందరికీ ఉపాధి లభించింది. మహిళా సాధికారత సాధ్యమైంది. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు సామాన్యులను ఎంతో మంచి చేశాయి. ఎన్టీఆర్ అడుగుజాడల్లో చంద్రబాబు నడుస్తున్నారు. ప్రపంచానికి, ఒక విజన్ కు ఆదర్శం చంద్రబాబు.
కనకపు సింహాసనంపై శునకంలా రాష్ట్రంలో సైకో పాలన సాగుతోంది. నవశకం.. అంతం కాదిది ఆరంభం. జగన్ ప్రభుత్వంపై పోరాటానికిక సమయం లేదు, విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాల్సిందే. నూతిలో కప్పలా, తాడేపల్లి ప్యాలెస్ తన సర్వస్వం అని జగన్ అనుకుంటున్నారు. వైసీపీ అక్రమాలకు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రజా సమస్యలపై పవన్ కల్యాణ్ పోరాటం అభినందనీయం. ఎన్టీఆర్ తెలుగు జాతి గౌరవం పెంచితే, చంద్రబాబు తెలుగు ప్రజల్లో విశ్వాసం పెంచారు. పవన్ కల్యాణ్, నేను.. ఇద్దరం ముక్కుసూటి మనుషులమే. ఇకపై విజృంభిస్తాం.
Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?
రాష్ట్ర భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. సమయం లేదు మిత్రమా. విజయమా వీర స్వర్గమా అనే పరిస్థితి ఉంది. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు జగన్. ఉపాధి లేక ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. సమ్మిట్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఉచిత పథకాల మోజులో ప్రజలు పడొద్దు” అని బాలకృష్ణ అన్నారు.
Also Read : మంత్రి రోజాకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్‌లు.. పెద్దిరెడ్డి ఇంటి నుంచి మరొకరికి టికెట్?
నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం-నవశకం పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలి వచ్చాయి.