Corona Cases : ఏపీలో కొత్తగా 5వేల 86 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 5వేల 86మంది కరోనా బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

Newly 5086 Corona Cases In Ap
Newly 5086 corona cases in AP : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 5వేల 86మంది కరోనా బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 14 మంది కరోనాతో చనిపోయినట్లు తెలిపింది.
అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 835 మంది కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 626 మంది, గుంటూరు జిల్లాలో 611 మంది, శ్రీకాకుళం జిల్లాలో 568 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 450 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.
అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 31 మంది, కడప జిల్లాలో 96 మంది కరోనా బారిన పడ్డారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపురము, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు, కడప, కృష్ణ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
గత 24 గంటల్లో 35వేల 741మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 31వేల 710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ మొత్తం 7వేల 353 మంది ప్రాణాలు కోల్పోయారు.