క్షుద్రపూజలు : యువకుడిని హత్య చేసి కాల్వలో పడేసిన దుండగులు

క్షుద్రపూజలు : యువకుడిని హత్య చేసి కాల్వలో పడేసిన దుండగులు

Updated On : February 11, 2021 / 3:41 PM IST

Thugs killed a young man : అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. బొమ్మనహల్ మండలం ఉంతకల్లు సమీపంలో యువకుడిని హత్య చేసి కాల్వలో పడేశారు. ఇవాళ అమావాస్య కావడంతో తెల్లవారుజామున కాల్వ గట్టుపై క్షుద్రపూజల చేసి యువకుడిని బలి ఇచ్చినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

పూజల అనంతరం యువకుడి తలపై బండరాయితో కొట్టిన ఆనవాళ్లు కనిపించాయి. అనంతరం మృతదేహాన్ని హెచ్‌ఎల్సీ కాల్వలో పడేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

మరోవైపు కర్నూల్ జిల్లా బనగానపల్లె మండలం కొండపేటలో క్షుద్రపూజల కలకలం రేపింది. 150 ఏళ్ల నాటి ఇంటిలో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం పూజలు చేసిన ఆనవాళ్లు వెలుగు చూశాయి. ముగ్గులను చెరివేసి ఇంటికి తాళం వేసి వెళ్లడంతో.. పూజలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం మెడికల్‌షాప్‌ యజమాని రవితేజ ఆ ఇళ్లును కొన్నారు.