Amaravati Capital: అమరావతి అంటే రైతులకు మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రాజధాని

అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తుండగా వాటిపై సీజే మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రీ ఆర్గనైజేషన్ చట్టం, ల్యాండ్ పూలింగ్....

Amaravati Capital: అమరావతి అంటే రైతులకు మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రాజధాని

Amaravati Capital

Updated On : November 16, 2021 / 6:18 PM IST

Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపిస్తుండగా వాటిపై సీజే మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రీ ఆర్గనైజేషన్ చట్టం, ల్యాండ్ పూలింగ్, ఇన్ సైడర్ ట్రేడింగ్ లాంటి పలు అంశాలను ప్రస్తావించారు.

పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు:
అమరావతి రాజధానిగా ఉండాలని రైతులు జీవనోపాధిని త్యాగం చేశారు. రాష్ట్ర రాజధాని, ప్రాంత అభివృద్ధి కోసం చేసిన త్యాగాలు వెలకట్టలేనివి. ఆ సందర్భంగా గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన న్యాయబద్ధమైన హామీలు ప్రస్తుత ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. వీలైనంత త్వరగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేయాలి. రాష్ట్ర అభివృద్ధి కోసమే భూములను ఇచ్చారు. రాజకీయ విద్వేషంతో అమరావతిని ప్రస్తుత ప్రభుత్వం ఘోస్ట్ క్యాపిటల్‌గా మార్చేసింది.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి శ్యాం దివాన్ వాదనలు:
అమరావతి రీఆర్గనైజేషన్ చట్టం గురించి ధర్నాసనానికి వివరిస్తూ.. రాజధానికి‌ స్వచ్చందంగా భూములు ఇచ్చారు. సీఆర్‌డీఏ ఏర్పాటు చేసి చట్టబద్దంగా ల్యాండ్ పూలింగ్ జరిపారు. గ్రామ సభల ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు తెలిపారు. ఆ తర్వాత రైతులు ముందుకొచ్చి 33 వేల ఎకరాల భూములు ఇచ్చారు. అమరావతి ప్రజల రాజధాని, ఇందులో రైతుల భాగస్వామ్యం కీలకం. అమరావతి రైతుల నుండి ఎటువంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు లేవనెత్తకపోవడంతో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ సస్పెండ్ చేసింది. భూముల కొనుగోలు ‌అంశంలో ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడైనా ఆస్తిని కొనుగోలు చేసే హక్కు ఉంది.

……………………………………….. : జూ.ఎన్టీఆర్@21.. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే!..

సిజే మిశ్రా స్పందన
30 వేల మంది రైతులు అమరావతి రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. అమరావతి రాజధాని రైతులది మాత్రమే కాదు. ఆంద్రప్రదేశ్ మొత్తానికి రాజధాని. కర్నూల్, వైజాగ్, ఏపీ ప్రజలందరికీ రాజధాని. స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం పోరాడారంటే.. అది దేశం కోసం. స్వాతంత్రం కేవలం స్వాతంత్ర సమరయోధులది కాదు. దేశ ప్రజలందరిది.

ఇలా అమరావతి రాజధాని అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది.