Jr NTR : జూ.ఎన్టీఆర్@21.. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే!..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడిగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు..

Jr NTR : జూ.ఎన్టీఆర్@21.. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతంటే!..

21 Magical Years Of Ntr

Jr NTR: బాల నటుడు, క్లాసికల్ డ్యాన్సర్, నూనుగు మీసాల ప్రాయంలోనే అప్పటివరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బీట్ చేసేంత స్టార్‌డమ్, ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యంగ్ స్టార్ హీరో.. స్టార్ హోస్ట్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్..

Balakrishna – Jr NTR : నందమూరి ఫ్యాన్స్‌‌కి గుడ్‌న్యూస్.. త్వరలో ఒకే వేదికపై బాబాయ్-అబ్బాయ్..

నవంబర్ 16తో తారక్ నటుడిగా ఎంట్రీ ఇచ్చి 21 సంత్సరాలు పూర్తవుతున్నాయి. మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ గురించిన వార్తలే. తారక్ సినిమాల గురించి.. అతని గురించి తెలియని ఇంపార్టెంట్ విషయాల గురించే పెద్ద ఎ్తతున వార్తలు వైరల్ అవుతున్నాయి.

Jr NTR : జిమ్ చేస్తుండగా జూ.ఎన్టీఆర్‌కు గాయం… సర్జరీ

ప్రస్తుతం సోషల్ మీడియాలో #NTR #RRRMovie #21MagicalYearsOfNTR #ManOfMassesNTR ఈ హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ జెనరేషన్ హీరోల్లో యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్.. ఇలా ప్రతీ దానిలోనూ తారక్ బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. తాత ఎన్టీఆర్‌తో కలిసి మొట్టమొదటిసారి ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో బాలనటుడిగా కనిపించాడు జూనియర్ ఎన్టీఆర్.

Jr NTR : ఇట్స్ పార్టీ టైమ్.. తారక్ పిక్స్ వైరల్..

1997లో అందరూ పిల్లలతో గుణశేఖర్ తీసిన ‘బాల రామాయణం’ లో చిన్నప్పటి రాముడిగా అద్భుతంగా నటించడంతో పాటు ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డ్ అందుకున్నాడు. సినిమాకు కూడా జాతీయ అవార్డ్ వచ్చింది.

ఎన్టీఆర్ షూ ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు..!

2001లో ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ‘నువ్వు వస్తావని’ డైరెక్టర్ దివంగత వి.ఆర్. ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. 2000 సంవత్సరం నవంబర్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు తారక్ వయసు 17 ఏళ్లు.

NTR : తనయులతో ఎన్టీఆర్ దీపావళి స్పెషల్ పిక్

2001 మే 25న ‘నిన్ను చూడాలని’ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి గానూ ఎన్టీఆర్ అందుకున్న పారితోషికం అక్షరాలా నాలుగు లక్షలు. ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక అమ్మ చేతిలో పెట్టేసాడట. అలాగే చాలా రోజుల పాటు లెక్క పెడుతూ ఉండే వాడట. 2000 నుండి 2021 వరకు.. ఇన్ని సంవత్సరాల్లో తారక్ స్టార్‌డమ్, రెమ్యునరేషన్ ఎంతలా పెరిగిందో కొత్తగా చెప్పక్కర్లేదు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో నటించిన ‘ఆర్ఆర్ఆర్’ తో పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు యంగ్ టైగర్.

Jr NTR : సీనియర్ ఫ్యాన్‌తో జూనియర్..